A place where you need to follow for what happening in world cup

తెలుగుదేశం జనసేన కలిసే వెళ్తాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో , తెలుగుదేశం జనసేన కలిసే వెళ్తాయని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గురువారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అయన పరామర్శించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.  ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. చంద్రబాబును రిమాండ్ కు తరలించడం బాధాకరం. 2014లో బిజెపి , టీడీపీ కి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడు కావాలనే. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్లే గతంలో నేను చంద్రబాబుతో విభేదించాను. వ్యక్తిగతంగా చంద్రబాబు సమర్థత నాకు తెలుసు. జగన్ ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి. జగన్ దేశం విడిపోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అడుగడుగునా చట్టాలు ఉల్లంఘిస్తున్న జగన్.

రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఉందా? ఉపాధి అవకాశాలు వచ్చాయా? మద్యపాన నిషేధం జరిగిందా?  సిపిఎస్ రద్దు చేశారా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించకూడదా ? వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని అన్నారు. వివేక హత్య కేసులో అన్ని వేళ్ళు జగన్ వైపే. ముంద్రాపోర్ట్లో హెరాయిన్ పట్టుకుంటే దాని మూలాలు ఏపీ లోనివే. అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఎవరు చట్టానికి అతీతులు కాదు. చంద్రబాబుని రాజకీయ ప్రతీకారంతోనే అరెస్ట్ చేశారు. 2024లో టిడిపి బిజెపి జనసేన కలిసి వెళ్లాలని నా అభిప్రాయం. నేను ఎన్డీయే లో ఉన్నా. వైసిపి దౌర్జన్యాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలి. అందుకోసం విడివిడిగా పోటీ చేస్తే కుదరదు. ఇన్నాళ్లు కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పేవాణ్ణి. కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కలిసి వెళ్తాయని స్పష్టతనిచ్చారు. అయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వున్నారు.

Leave A Reply

Your email address will not be published.