గణపతి పూజ చాలావిశిష్ఠమైనదని, శక్తివంతమైనదని తద్వారా శుభ ఫలాలను అత్యధికంగా పొందుతామని
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పట్టణం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్సెక్స్ట్ వేడుకగా వేద మంత్రాల మధ్య ఏర్పాటు చేసినటువంటి మట్టి గణపతే మహా గణపతి, వినాయక చవితి విశిష్ఠత అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగనములో విశేష పూలతో అలంకరించినటువంటి మట్టి గణపతికి పూజా కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజలందరు పర్యావరణ హితంగా మెదలాలని, పర్యావరణ పరిరక్షణే ప్రధాన విధిగా భావించి ముందుకు సాగాలని కోరారు. ఉత్సవాలు అనగానే చాలా మంది ప్రణాళిక లేకుండా వ్యయం చేస్తారని దానిని విస్మరించి ఆధాయ వనరులను పెంపొదించుకునే దిశగా పయనించాలని వారు చెప్పారు.
మట్టి విగ్రహాలను పూజించడం వలన ముల్లోకాల్లో పూజలు చేసినంత ఫలితం వస్తుందని పలు పురాణాల్లో స్పష్టంగా లిఖించబడినదని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు ఉత్సవాలలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షకులుగా ఉండాలని పిలుపునిచ్చారు.నేడు చాలా మందికి అవగాహన లేకపోవటం వలన ఇష్టానుసారంగా ప్రతిమలను ప్రతిష్టిస్తున్నారని గుర్తు చేస్తు ప్రతిష్టించటం చాలా మంచి సూచిక కాని వారు పర్యావరణ ప్రేమికులుగా మట్టితో చేసినవి ప్రతిష్టించాలని సూచించారు. తద్వారా సమాజాన్ని కాలుష్య కొర నుండి కాపాడావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వారు నిర్వహకులకు పారితోషికాలను ప్రకటించాలని, రాయితీలు ఇవ్వాలని కోరారు. నిర్వాహకులు అందరు తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణ నియమాలను పాటించాలని మనవాళికి రక్షణ కవచంగా ఉండాలని కోరారు.
సమాజానికి చేయుతనివ్వాటానికై నిర్వాహకుల్లో ఉత్సహం నింపటానికై నేడు పాఠశాలలో మట్టి గణపతి ఉత్సవాన్ని నిర్వహించామని తెలిపారు.
ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని ప్రకృతి మిత్రునిగా వ్యవహరించాలని చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి మాగణపతి మట్టి గణపతి మరి మీది, మట్టి గణపతి శుభఫలాలకు అధిపతి నృత్యాలు చాలా ఆకర్షింపచేశాయి. సదస్సులో భాగంగా విద్యార్థులచేత మట్టిగణపతి కి జై, మట్టి గణపతి ని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి గణపతియే మహాగణపతి అని నినాదాలు చేపించి చక్కటి అవగాహన కల్పించారు. వేడుకలను మరింత ఉత్సాహపరిచే విధంగా సుమారు 100 మంది విద్యార్థులు వివిధ దేవతాముర్తుల రుపాల్లో విచ్చేసి భక్తి వాతావరణాన్ని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.