శుక్రవారం నాడు బేగంపేటలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటిన ఎరిక్ సోల్హీమ్.. అనంతరం మాట్లాడుతూ.. “మనిషి సృష్టించిన కాలుష్యం, కర్భన ఉద్గారాలు, అడవులను నరకడం” ఈ భూమిని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ద్వారా దశాబ్ధ కాలంలోనే 7% శాతం అడవులు పెరగడం అద్భుతమైన విషయం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజనరీ లీడర్ షిప్ కు నిదర్శనం. ఇలాగే దేశంలో ప్రతీ రాష్ట్రం తెలంగాణ స్పూర్తిగా.. మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.
తెలంగాణలో ప్రభుత్వం మాత్రమే కాదు, జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా తన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ద్వారా కోట్ల మందిని కదిలించారు.. కోట్లాది మొక్కలు నాటించారు. ఆయన ప్రతీరోజు ప్రపంచంలో ఎక్కడో ఓ చోట నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతుంటరనే విషయాన్ని చాలామంది పర్యావరణ మిత్రులు నాతో చెప్పారు. పచ్చదనం పెంపులో వారిది అద్భుతమైన పాత్ర. అంతేకాదు.. వారు ప్లాస్టిక్ నియంత్రణ కోసం కార్యక్రమాల్ని రూపొందించి అమలు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం.
మన పూర్వీకులెవరు ప్లాస్టిక్ వాడలేదు.. కానీ మనం కావాలని తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ భూతం ఇవ్వాల నేలను, మానవాళిని తినేస్తుంది. ఇది ఆగిపోవాలంటే ప్రతీ ఒక్కరు జోగినిపల్లి సంతోష్ కుమార్ కావల్సిన అవసరం ఉంది. నేను ఇవ్వాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముగ్గురు పర్యావరణవేత్తలకు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసురుతున్నాను. వారితో మొక్కలు నాటించి ప్రపంచవ్యాప్తంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను విస్తరించేందుకు నా వంతు తోడ్పాటును అందిస్తానంటూ తెలిపిన ఆయన.. ఇంతమంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.