A place where you need to follow for what happening in world cup

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ‌ట్రెండ్‌ ‌సెట్టర్‌

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ‌ట్రెండ్‌ ‌సెట్టర్‌
‌సంకీర్ణ రాజకీయాలకు ఆయనే ఆద్యుడు
కకష్టాన్ని నమ్ముకునే వారే కమ్మవారు
అమ్మలాగా అన్నం పెట్టి ఆదుకునే గుణం వారి సొంతం
తెలంగాణ అభివృద్దిలో వారు భాగస్వామ్యం కావాలి
వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సిఎం రేవంత్‌

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఒక బ్రాండ్‌ ‌క్రియేట్‌ ‌చేశారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ‌వల్లనే దేశంలో సంకీర్ణ రాజకీయ శకం మొదలయ్యిందన్నారు. ఎందరో ఆయన నీడలో రాజకీయ జీవితాన్ని పొందారని అన్నారు.  హైదరాబాద్‌ ‌కమ్మ గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌మాట్లాడుతూ దేశానికి సంకీర్ణ రాజకీయాలు ఎన్టీఆర్‌ ‌నేర్పించారన్నారు. ఎంతో మందిని రాజకీయాలకు పరిచం చేసిన వ్యక్తని అన్నారు. పది మందిని ఆదుకునే గుణం కమ్మవారిదని చెప్పారు. వారు తమ సమజమైన ఆదుకునే గుణంతో మరింతగా ఎదగాలని ఆకాక్షించారు. తెలంగాణ అభివృద్దిలో హైదరాబాద్‌ ‌పురోభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. కష్టపడేతత్వం కమ్మవారిదని, అలా ఎన్నో రంగాల్లో వారు రాణిస్తున్నారని అన్నారు. కమ్మల కష్టానికి గుర్తింపు అవకాశాలు ఉంటాయని చెప్పారు.  మట్టి నుంచి బంగారం తీయగల శక్తి కమ్మవారికి ఉందన్నారు. ఎన్టీఆర్‌ ‌రాజకీయాలకు ఒక బ్రాండ్‌ అని లీడర్‌ ‌షిప్‌ ‌కు ఒక కబ్రాండ్‌ అని అని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2023కి ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. ఎన్నికలు, ఇతర పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదని పేర్కొన్నారు. 90 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమం ఘనంగా నిర్వహించారని వివరించారు. కమ్మ అంటే అమ్మలాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది.. కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారు. వారు కష్టపడి పంటలు పండించాలి.. పది మందికి ఉపయోగపడాలి అనుకుంటారు. నేను ఎక్కడ ఉన్నా… వారు నన్ను ఎంతో ఆదరిస్తారు.

అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్‌ ‌నుంచే నేర్చుకున్నా. ఎన్టీఆర్‌ ‌లైబ్రరీలో చదివిన చదువు మమ్మల్ని ఉన్నత స్థానాలకు తెచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కమ్మ భవనం నిర్మాణానికి కేటాయించిన భూమిని అప్పగిస్తామని, నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. వివిధ వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఉన్నవారు హైదరాబాద్‌ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్నారు.ఇకపోతే జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం పూర్తిగా తగ్గిందని అన్నారు. జైపాల్‌ ‌రెడ్డి, వెంకయ్యనాయుడు లాంటి వారు లేకపోవడంతో లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో తెలుగు వారంతా నాయకత్వం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క, నటుడు మురళీ మోహన్‌ , ‌కాంగ్రెస్‌ ‌నేత కుసుమ కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.