- డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి
- నిధులు కేటాయించకుండా ప్రజలందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందించడం అసాధ్యం
జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యారంగంలో గొప్ప మార్పులు తెస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం,బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన 2.6శాతం నిధులు కేటాయించడం చూస్తే కేంద్ర ప్రభుత్వానికి విద్యారంగం పై ఎంత శ్రద్ధ ఉన్నదో అర్థమవుతున్నదని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు విమర్శించారు.
తగినన్ని నిధులు కేటాయించకుండా ప్రజలందరికీ నాణ్యమైన సమానమైన విద్య అందించడం సాధ్యం కాదు అన్న విషయం పాలకులకు తెలియంది కాదు.అయినను దశాబ్దాలుగా విద్యారంగాన్ని పట్టించు కోకపోవడం ద్వారా పేదలకు,బలహీనవర్గాలకు ఉద్దేశ్యపూర్వ కంగా అన్యాయం చేసినట్లే అన్నారు.
అదేవిధంగా ఆదాయం పన్నులో కూడా మధ్యతరగతి వేతన జీవులకు నిరాశనే మిగిల్చింది. పాత విధానంలోని స్లాబులు మార్చకుండా కొత్త విధానంలో మాత్రమే కొంత వెసులుబాటు కల్పించడం వలన వేతన జీవులకు పెద్దగా ఒరిగేదేమిలేదని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు అన్నారు.