A place where you need to follow for what happening in world cup

ఇంకెన్నాళ్లు టికెట్ల కోసం ఎదురుచూపులు….!

  • సమయం ముంచుకొస్తున్నా చప్పుడు లేని కాంగ్రెస్ బిజెపి
  • అభ్యర్థులు ప్రకటించక ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ బిజెపి క్యాడర్ అయోమయం
  • ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సంకేతాలు వస్తున్నప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయడంలో కాంగ్రెస్ బిజెపిలలో గజిబిజి గందరగోళం
  • అధిష్టానం నాన్చుడు ధోరణిపై నాయకుల ఆగ్రహం
  • ఢిల్లీ నుండి జాబితాకు పచ్చ జెండా ఎప్పుడు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ల క్యాడర్ అయోమయానికి గురవుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యటన జరపడం ఎన్నికల నోటిఫికేషన్ ఓ వారం రోజుల్లో వస్తుందన్న సంకేతాలు వెలువడుతుండటం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టికెట్లు ఇవ్వడంలో జాప్యం జరగడం పట్ల ఆయా పార్టీల సెకండ్ క్యాడర్ కార్యకర్తల్లో ఒక రకమైన గజిబిజి గందరగోళం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బిజెపిలు అభ్యర్థుల్ని కేటాయిస్తున్నట్టు ప్రకటన వెలువడకపోవడంతో ఆయా పార్టీల్లో క్యాడర్ తికమక పడుతున్నారు అయోమయానికి గురవుతున్న క్యాడర్ను కాపాడుకోవడానికి ఆయా పార్టీల తరఫున పోటీలో ఉండటానికి రంగం సిద్ధం చేసుకున్న నాయకులు పరేషాన్ పడుతుండ్రు తమ తమ పార్టీల సెకండ్ కేడర్ నాయకులను ముఖ్య కార్యకర్తలను చేజారి పోకుండా కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

కాంగ్రెస్ బిజెపి అధిష్టానాలు త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయకుండా నాన్చుడు, దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండటంతో ఆయా పార్టీల నాయకుల్లో ఒకింత అసహనం, ఆవేశం అనుమానం అభద్రతాభావం, కొట్టొచ్చినట్టు, కోపం చిరాకు ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే చక్రం ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని పిల్లి గంతులు వేసిన ప్రయోజనం ఉండదనే విషయం కూడా కాంగ్రెస్ బిజెపి నాయకులకు అవగతం అవుతుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక బలమా, అంగ బలమా, సమర్థతనా, సామర్ధ్యమా, సర్వేల ప్రామాణికమా, పైరవీలదే రాజ్యమా, ప్రజాదరణ గల గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారా, అనుభవం పరిగణలోకి తీసుకుంటారా, వస్తుందా రాదా ఇలా సవా లక్షల ప్రశ్నలు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపి పార్టీ ల తరఫున పోటీ చేయాలని ఉవ్విల్లురుతున్న నాయకులు తహతహ పడుతున్నారు. అయితే టికెట్ ఎలాగైనా దక్కించుకోవడానికి చాప కింద నీరులా ఒకరికి తెలియకుండా మరొకరు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ఢిల్లీ నుండి జాబితాకు పచ్చ జెండా ఎప్పుడు ఊపునో

కాంగ్రెస్ బిజెపి పార్టీల పెద్దలు ఢిల్లీలో తెలంగాణ లో పోటీ చేసే జాబితాలను ఎప్పుడు ప్రకటిస్తారో ఎన్ని జాబితాలు ఉంటాయో అందులోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి విడత రెండవ విడత మూడవ విడత ఇలా విడతలవారీగా ప్రకటించే జాబితాలలో తమ పేర్లు ఉంటాయో ఊడుతాయో తెలియక ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎమ్మెల్యేలుగా నిలబడే అభ్యర్థులు తర్జనభర్జనలు పడి చర్చల్లో మునిగి తేలుతున్నారు. మొదటగా రాష్ట్రస్థాయిలో నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొని పైరవీలు చేసి స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిన జాబితా ఢిల్లీ పెద్దలు అంగీకరిస్తారా మళ్లీ మార్పులు చేసి కొత్త జాబితా తయారు చేస్తారా అన్న మీమాంస లో కూడా కాంగ్రెస్ బిజెపి పార్టీల ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఉన్నారు.

కారు ముందస్తు ప్రచారం చేస్తుంటే ఇంకా తాము ఎప్పుడు చేయాలి

ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ప్రచారం చేస్తుంది. అధికార పార్టీ ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే ఇంకా తాము ఎప్పుడు ప్రచార రంగంలో దూకాలని కాంగ్రెస్ బిజెపిల తరఫున టికెట్ను ఆశిస్తున్న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. టికెట్ వచ్చేది ఎప్పుడు నాయకులని సమన్వయపరిచేది ఎప్పుడు? కార్యకర్తలని కలుసుకునేది ఎప్పుడు ఇలా అనేక రకాల ప్రశ్నలు మదిలో మెదులుతున్న వేళ కాంగ్రెస్ బిజెపి నాయకులు ఇంకా ఎప్పుడు టికెట్ వస్తుందో అని ఎదురుచూపులు చూస్తూ తలలు పట్టుకుంటున్నారు. సరైన దిక్సూచి లేక చుక్కాని లేని నావలా తలో దిక్కుగా చెల్లాచెదురుగా నాయకులు, కార్యకర్తలు ఎటు పోతారు ఎక్కడ ఉంటారో ఏ పార్టీ లాగుతుందో ఏ పార్టీలో చేరడానికి సిద్ధమవుతారు తమతో ఉంటారా ఉండరా వేరే పార్టీలోకి వెళ్ళుతారా ఇలా అనేక సందేహాలు అనుమానాల మధ్యన కాంగ్రెస్ బిజెపి పార్టీల అసెంబ్లీ టికెట్లను ఆశించే నాయకులు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే అధికార పార్టీలోకి వెళ్లకుండా తమ కేడర్ను చేజారి పోకుండా కాంగ్రెస్ బిజెపి నాయకులు కత్తి మీద సాము చేస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచారం చేసుకోవడం ఎలా

అధికార పార్టీ ప్రభుత్వంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతను ఎవరు ప్రచారం చేయాలో తెలియక ఇటు టికెట్టు కేటాయిస్తున్నట్టు సమాచారం లేక కాంగ్రెస్ బిజెపి నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ పట్ల ప్రజల్లో చాలావరకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు తొందరగా టికెట్ కేటాయిస్తే వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ బిజెపి నాయకులు భావిస్తున్నారు. అయితే ఎవర్ని ఏ నాయకుడిని ముందు పెట్టి ప్రచారంలోకి వెల్లాలో తీరా ప్రచారం మొదలుపెట్టి ప్రజలకు ప్రభుత్వ అవినీతిని అక్రమాల్ని తెలియచెప్పితే తీరా అన్ని ఖర్చులు భరించి ప్రచారం చేస్తుంటే అసలు తమకు టికెట్ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల తరఫున టికెట్ను ఆశించే నాయకులు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. మరి కొన్ని రోజులు ఆగితే గాని కాంగ్రెస్ బిజెపి పార్టీల తరపున అసెంబ్లీ బరిలో నిలుచునే అభ్యర్థులు ఎవరో ఒక కొలిక్కి రానుంది.

Leave A Reply

Your email address will not be published.