- 18 ఎఫ్.ఐ.ఆర్ లు ఉన్నా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు
- వెంటనే జానయ్య తో పాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలి
- ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో బాధితుల గగ్గోలు
- మూకుమ్మడిగా కలిసి మరోమారు పిర్యాదు చేసిన జానయ్య బాధితులు
న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లెక్కిన తమను వట్టే జానయ్య తో పాటు ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని, వారి తో మాకు ప్రాణ భయం ఉందని సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ను ఆశ్రయించారు డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ బాధితులు. ఇటీవల కాలం లో మా హక్కులను భంగం కలిగిస్తూ, రివాల్వర్ తో బెదిరించి భూములను ఆక్రమించుకున్నారనే నెపం తో జిల్లా లోని పలు స్టేషన్ లనలో బాధితులు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.2009 నుండి నేటి వరకు 18 ఎఫ్. ఐ. ఆర్ లు నమోదు అయ్యాయి. ఇక పిర్యాదు లు వంద క్రాస్ అయ్యాయి.
అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా జానయ్య హైకోర్టు లో దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మిస్ చేయడం తో ఆయన అనుచరులు కేసు లు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని, వారి తో మాకు ప్రాణ భయం ఉన్న కారణాగా, జానయ్య తో పాటు ఆయన అనుచరులను వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వంద మంది కి పైగా జానయ్య బాధితులు అడిషనల్ ఎస్పీ ని కలిసి మరోమారు పిర్యాదు చేశారు. స్పందించిన అడిషనల్ ఎస్పీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు త్వరలోనే జానయ్య ఆయన అనుచరులు ఎక్కడ ఉన్నా పట్టుకుని , బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.