పొలింగ్ సిబ్బంది, ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలి
పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్, డిప్యూటి ఎన్నికల అధికారిణి బి.ఎస్. లత అన్నారు. గురువారం ఐడి ఓ సిలో తన చాంబర్ నుండి ఆర్దిఓలు, పలు శాఖల ఇంజనీరింగ్ అధికారులు, తహశిల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ లో జరుగనున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ర్యాంపులు, రేలింగ్స్, ఫర్నిచర్ వంటి సౌకర్యాలపై ఆయా మండల తహశిల్దార్లతో సమీక్షిస్తూ, పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉండే విధంగా ఆయా ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు పూర్తీ చేయాలని ఆదేశించారు.
దివ్యాంగులకు ర్యాంపుల ఏర్పాట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గల పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా వివరాలను పరిశీలించి స్విచ్ బోర్డ్ లను, ఫ్యాన్లు నడిచే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని, లేని యెడల అవసరమైన మరమ్మతులు చేయించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మరుగు దొడ్లు లేని పోలింగ్ కేంద్రాలలో ఉపాధి హామీ పథకం కింద నిర్మాణాలు చేపట్టాలని పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలను సజావుగా, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తీ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.
మండల తహశీల్దార్లు పోలింగ్ కేంద్రాలలోని వసతులను పరిశీలించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఆయా ఇంజనీరింగ్ అధికారులు సకాలంలో పూర్తీ చేసి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్సులో ఆర్దిఓలు నరసింహ మూర్తి, రాజేశ్వర్ , వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.