- ఎరుకల జాతిలో నామినేటెడ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించారు
- మంత్రి హరీష్ రావు ఫైర్
బిజెపి ప్రభుత్వం గవర్నర్ ను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎరుకల జాతిలో నామినేటెడ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించడాన్ని ఖండించారు. ఉత్తరప్రదేశ్లో బిజెపి వాళ్ళకి నామినేట్ పదులు కట్టబెట్టారు… ఆ రాష్ట్రానికి ఒక నీతి… మన రాష్ట్రానికి ఒక నీతా..? అని ప్రశ్నించారు. గురువారం మెదక్ లో రాష్ట్రంలోనే మొదటి సారిగా 60 కోట్లతో మెదక్లో జిల్లాలో ఎరుకల సాధికారత కార్యాక్రమం గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ఎరుకల జాతి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలంటే కష్టంగా ఉంటుందని ఎమ్మెల్సీగా తీసుకున్నామన్నారు. ఎరుకల జాతిలో నామినేటెడ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే గవర్నర్ తిరస్కరించారు.ఎరుకల జాతిలో ఒకరికి, విశ్వ బ్రాహ్మణ కులంలో ఇంకొకరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
ఇలాంటివారిని గవర్నర్ తిరస్కరించడం షోచనీయమన్నారు. దేశంలోనే బిజెపి ప్రభుత్వం గవర్నర్ ను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజామెత్తారు.విశ్వబ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్టు కట్టి బిజెపికి గుణపాఠం చెప్పాలన్నారు.ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ ఇచ్చిందా? బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా..? అని ప్రశ్నించారు.బిజెపి వాళ్ళు గవర్నర్ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుంది…వారికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.కులాలు, జాతుల గురించి ఆలోచించిన వ్యక్తి కెసిఆర్ అన్నారు. చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడని గుర్తు చేశారు. చివరకు అందరూ కలిసి ఆయన్ని బ్యాన్ చేశారన్నారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దన్నారు. విద్యా, వైద్యంలో 10 శాతం రిజర్వేషన్ వల్ల ఇంజనీరింగ్, వైద్య కళాశాలలో రాణిస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్లే ఉన్నత చదువుల్లో రాణిస్తున్నారన్నారు పిల్లల చదువులు, జీవితాలతో బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. బిజెపి బ్యాక్ డోర్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.