- ఆర్డీవో వ్యవహార శైలిపై భక్తులు తీవ్ర ఆగ్రహం
- దేవాదాయశాఖ అనుమతి లేకుండా కూల్చివేత
- భారీగా చేరుకుంటున్న భక్తులు
హైదరాబాద్:సైదాబాద్ ప్రధాన రహదారి పై ఉన్న పురాతనమైన హనుమాన్ దేవాలయానికి సంబంధించిన మఠలను ఆర్డీఓ వెంకటేశ్వర్లు దేవాలయ కమిటీని, దేవాదాయ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు భారీ ఎత్తున సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి ఆర్డీవోను ఫోన్లో సంప్రదించగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఫోన్ పెట్టేయని బెదిరించడం జరిగింది.
దేవాలయ ఈఓ ను సంప్రదించగా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం జరిగిందని ఈ దేవయలనికి 2719 గజాల స్థలం ఉన్నది. కూల్చివేయాలంటే మాకు సమాచారం అందించలేదని చెప్పారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డీవో వ్యవహరించారని కమిటీ సభ్యులు తెలుపారు. దీనితో ఆర్డీఓ వ్యవహార శైలిని పై భక్తులు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది