‘సుప్రీమ్’కు పతంజలి సంస్థ అఫిడవిట్
14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్ దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ స్టోర్లకు సూచించామని తెలిపింది. అలాగే వాటికి సంబంధించిన ప్రకటనలను ఉపసం హరించు కోవాలని డియా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీం కోర్టు విచారణను ఎదుర్కొంటోంది. దానిలో భాగంగా తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రక టనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసె న్సును రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఆయుర్వేద సంస్థ నుంచి స్పందన వచ్చింది.