జగిత్యాల:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ప్రజలు ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వివరించారు.బుధవారం జిల్లా లోని ధర్మపురి పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయాలలో ఈవీఎం యంత్రాల వినియోగం పై అవగాహన కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ కమీషన్ ఆదేశాల మేరకు పారదర్శక ఓటరు జాబితా సిద్ధం చేయడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని రాబోవు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలు ప్రజాస్వామ్యంలో తన విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ దివాకర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు