ఉన్నతాధికారులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్ జూలై 29: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపై కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి. సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇతర శాఖలతో మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నిండిన చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలకు ప్రతి జిల్లాలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్‌ని చేపట్టాలన్నారు. ప్రజలు మంచినీరు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలు తొలగగించాలి. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకొని మరమ్మతులు చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.