A place where you need to follow for what happening in world cup

తుంగతుర్తి నియోజకవర్గంలో నాడు రక్తపుటేరులు -నేడు కాలేశ్వరం జలాలు

  • నాడు కక్షలు కార్పన్యాలు హత్యాకాండలు నేడు రైతులకు రైతు కూలీలకు చేతినిండా పని
  • నాడు గ్రామాల్లో పోలీస్ పికెట్లు- నేడు ప్రశాంత వాతావరణంలో గ్రామాలు
  • ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ని గెలిపించాలి
  • తుంగతుర్తి లో గులాబీ జెండా ఎగరవేయాలి
  • తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిడిపి పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలతో రక్తం ఏరులై పారగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కాలేశ్వరం జలాలు గ్రామ గ్రామాన బీడు భూములలో పారుతున్నాయని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ల చేతుల మీదుగా44 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి ,అలాగే సుమారు 7 లక్షల పైగా నిధులతో నిర్మించనున్న వెలుగు పెళ్లి, రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సుమారు నాలుగు కోట్ల రూపాయలతో తుంగతుర్తి మెయిన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన అనంతరం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తుంగతుర్తి నియోజకవర్గం లో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయని అన్నారు సుమారు 90000 మందికి రైతుబంధు, 47 వేల మందికి ఆసరా పింఛన్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా అందుతున్నాయని అన్నారు .అంతేకాక కరువు కాటకాలతో అల్లాడే తుంగతుర్తి నియోజకవర్గంలో నేడు పచ్చని పంట పొలాలతో కలకలలాడుతున్నాయని అన్నారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ వారు తుంగతుర్తి ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ఉండి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని గత పది సంవత్సరాలుగా అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు .మారుమూల ప్రాంతమైన తుంగతుర్తిలో వైద్య సదుపాయాలు లేక పేద ప్రజానీకం ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వివరించగా స్పందించిన ముఖ్యమంత్రి వైద్యశాఖ మంత్రులు తుంగతుర్తి వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని నేడు వారి చేతుల మీదుగానే శంకుస్థాపన జరుగుతుందని అన్నారు .

తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే అన్నారు. అనునిత్యం కక్షలు కార్బన్యాలతో దాడులు దౌర్జన్యాలతో హత్యలు హత్యాయత్నాలతో గ్రామాల్లో పోలీస్ పికెట్లతో ఉద్రిక్తంగా ఉండి గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యే రోజుల నుండి నేడు ప్రశాంత వాతావరణంలో జీవనాన్ని సాగిస్తున్నారని రాజకీయ హత్యలు గానీ దాడులు ప్రతి దాడులు గాని నియోజకవర్గంలో లేని లేవని అన్నారు .తమ ఉనికిని కాపాడుకోవడానికి అభివృద్ధి చేస్తున్న వారిపై అవాకులు చవాకులు పేలుతున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. మరో మారు ముఖ్యమంత్రిగా కెసిఆర్ అయితేనే మరింత అభివృద్ధి జరుగుతుందని అందుకోసం ప్రజలు గులాబీ జెండాకు అండగా నిలవాలని తుంగతుర్తిలో అత్యధిక మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.