- లక్ష మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇద్దాం..
- సోషల్ మీడియాలో పోస్టులు బంద్ పెట్టాలి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభివృద్ధి చేసిన.. ఇక ముందు ఈ ప్రాంతాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చూసుకుంటారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖారైన నేపథ్యంలో బుధవారం జనగామ నిర్వహించిన మీటింగ్‌లో ముత్తిరెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధి చెబుతూనే చేయాల్సిన పనులపై పల్లాకు బాధ్యతలు అప్పగించారు. పల్లాకు స్వీట్ తినిపించి లక్ష మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్ గా పంపుతామని కార్యకర్తలతో కలిసి మాటిచ్చారు. ఈ సందర్భంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాసింత వంగి ముత్తిరెడ్డికి నమస్కరించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే ‘ ఇక ఫేస్ బుక్, వాట్సప్‌లు.. సోషల్ మీడియాలో అన్ని పోస్టులు బంద్ పెట్టాలి..’ అంటూ ఇరు వర్గాల కార్యకర్తలకు చెప్పారు. వారిద్దరి కలియిక.. ముత్తిరెడ్డి మాటలకు సభా ప్రాంగణం అంతా నవ్వులు విరజిల్లాయి. మంత్రి హరీశ్‌రావు సైతం పగల బడి నవ్వారు. కేసీఆర్ ఆశీర్వాదంతో వచ్చా : పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి తనను జనగామకు పంపారని, జనగామకు పెద్దన్న, ఉద్యమ కారుడిగా కేసీఆర్ వెంట నడిచిన ముత్తిరెడ్డి సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. తనను మంచి మనసుతో దీవించిన యాదన్నకు ప్రత్యేక ధన్యవాదాలని పల్లా పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు తన వద్దకు రావచ్చని, ఎలాంటి మధ్య వర్తిత్వం లేకుండా వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.