- ఉద్యమంలా కెసిఆర్ కు తోడుగా ఉన్న సంజయ్.
- సంజయ్ ను గెలిపిస్తే కోరుట్ల అభివృద్ధి.
- సంక్షేమ పథకాలు అందించడంలో మన రాష్ట్రం ముందంజ..
- కోరుట్ల పర్యటనలో ఎమ్మెల్సీ కవిత
మెట్‌పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు మల్లోసారి ఆశీర్వదించి మూడవసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్, వెల్లుల్ల, జగ్గసాగర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల కేంద్రాలతో పాటు, కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు మద్దతుగా జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత కు పలు గ్రామాల ప్రజలు మంగళహారతులతో డప్పు సప్పులు, డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు అంతకుముందు గండి హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన రోడ్ షోలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి పథంలో నడిపించాడని. ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కెసిఆర్ వెంట ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నామని అధైర్యపడవద్దని తన ఆరోగ్య పరిస్థితులను నిత్యం గమనిస్తూ ధైర్యం చెప్పాడని వైద్యులతోని మంచి వైద్యం అందించి కెసిఆర్ ప్రాణాలను కాపాడాడని తెలిపారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదాలతో గెలుపొందాడని అవే ఆశీర్వాదాలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి అందించి గెలిపించాలని. ఆయన గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా కేసిఆర్ గెలుస్తాడని, ఎమ్మెల్యేగా సంజయ్ గెలిస్తే ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉంటాడని. తెలంగాణ రాష్ట్రం తో పాటు కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతులకు రైతుబంధు, రైతు బీమా, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశాడని. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. భూమి, ఇండ్లు లేని నిరుపేదలకు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసిఆర్ రక్ష పేరుతో బీమా ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు 400 రూపాయలతో వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
బీడీ కార్మికులకు ఇప్పుడు వస్తున్న పెన్షన్ పెంచుతామని, కట్ ఆఫ్ లేకుండా ప్రతి బీడీ కార్మికులకు పెన్షన్ అందజేస్తామన్నారు. గత 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్, బిజేపీ పార్టీలు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వస్తారని. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అగ్రవర్ణ పేదలకు కూడా మోడల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలాగ ఉండెను ఇప్పుడు ఎలాగా ఉందో యువత, మేధావులు ఆలోచించాలని. గత పది ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో తాగు, సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.