బాలీవుడ్ నటవారసురాళ్లు, శ్రీదేవి కుమార్తెలు ప్రస్తుతం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కేంద్రక ఆకర్షణగా వేదికకు తగ్గట్టు తమ అందాన్ని ఎలివేట్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. నేటితరం Gen-Z నటి ఖుషీ కపూర్ ఇదే పంథాను అనుసరిస్తోంది. తన సోదరి జాన్వీ కపూర్ కి సైతం ఖుషీ పోటీనిచ్చేంతగా ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరిస్తోంది. తనదైన గ్రేస్- స్టైల్‌కు మారుపేరుగా ఖుషీ మేకోవర్ ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవలే అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి పార్టీలో ఖుషీ లుక్ ప్రత్యేకంగా ఆకర్షించింది.
ఈ బ్యూటీ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టగానే షో స్టాపర్ గా అలంకరించింది. ప్రముఖ ఫ్యాషన్ గురు మనీష్ మల్హోత్రా రూపొందించిన అద్భుతమైన ఐవరీ లెహంగాలో స్పాట్‌లైట్ లో వెలిగిపోయింది. ఎంతో సహజంగా అందాన్ని ప్రదర్శించడమే కాకుండా భారతీయ హస్తకళల గొప్ప సంప్రదాయానికి నివాళిగా కనిపించింది ఈ రూపం. బరువైన ఫ్లోర్-లెంగ్త్ లెహెంగా స్కర్ట్ వెడల్పాటి వెండి అంచుని కలిగి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగుకి రానుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త స్టార్ కిడ్స్ అరంగేట్రం చేస్తున్నారు.