- నమ్మకానికి మారు పేరు యాదవులు
- యాదవుల ఆత్మ గౌరవానికి ప్రతీక యదవ సంక్షేమ భవన్మాం
- సం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్రా
- ష్ట్ర అభివృద్ధిలో యాదవులు భాగస్వామ్యం కావాలి
- అట్టహాసం గా యాదవ సంక్షేమభవన్ కు శంకుస్థాపన
సూర్యాపేట లో ఐలాపురం వద్ద ఖమ్మం- విజయవాడ రహదారిపై రెండు ఎకరాలలో రెండు కోట్ల వ్యయంతో యాదవ భవన్ కోసం శంకుస్థాపన చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేసిన యాదవ సమాజం ముద్ర ప్రతినిధి సూర్యాపేటయాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రేరణ ఇవ్వడానికి యాదవ సంఘం భవనం ఉపయోగపడాలని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని ఖమ్మం విజయవాడ జాతీయ రహదారిపై ఐలాపురం వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న యాదవ సంక్షేమ భవన్ కు ఎంపీ బడుగుల లింగ యాదవ్ తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ యాదవుల ఆత్మగౌరవానికి వేదికగా యాదవ సంక్షేమ భవన్ ఉన్నారని ఆకాంక్షించారు.
యాదవ సంక్షేమ భవనాన్ని ఏడాదిలో నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు .ఏ అండ లేని యాదవ సోదరులకు యాదవ సంక్షేమ భవన్ అండగా నిలవాలని ఆకాంక్షించారు. కొంత నిధి కూడా సమకూర్చుకు ని వాటి ద్వారా యాదవ కుటుంబాల్లో చదువుకునే వారికి, వైద్యం అవసరం ఉన్న వారికి అండగా ఉందాం” అని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. గొల్ల, కుర్మలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టడం జరిగిందని చెప్పారు. దీంతో మాంసం ఉత్పత్తిలోని తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు.గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకు మాదిరిగానే చూశాయని, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది యాదవులకు ఎమ్మెల్యేలు గా అందులో నల్గొండ జిల్లాకు చెందిన 12 నియోజకవర్గాల్లో ఇద్దరు యాదవ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు ఉండడం యాదవ పక్షపాత ప్రభుత్వం బీఆర్ఎస్ అనడానికి నిదర్శనం అన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు గా అవకాశం కల్పించి రాజకీయంగా పెద్దపీట వేశామని గుర్తు చేశారు. నమ్మకానికి మారుపేరుగా ఉన్న యాదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి అండగా నిలబడి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ సంఘం నాయకులు గొట్టేటి సైదులు యాదవ్ దావుల వీరప్రసాద్ యాదవ్ సత్యనారాయణ యాదవ్ శ్రీనివాస యాదవ్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.