కావాలనుకుంటే సిఎంనే అవుతా
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రికావచ్చునని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రశాంత్ రెడ్డీ, మల్లారెడ్డి, గంగుల కమలకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో రాజ గోపాల్‌రెడ్డి సంభాషిం చారు. ఈ సందర్బంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిం దన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు జైలుకు వెళ్లే వారి జాబితాలో తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి లాంటి వారిని తాము కొనుగోలు చేయలే మన్నారు.గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్… రూ. 20, రూ. 30 కోట్లు ఇచ్చి రేటు ఎక్కువ పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. కానీ తాము మాత్రం రూ.5, రూ. 10 కోట్లకు మాత్రమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడుగుతున్నామని చెప్పారు.
అందుకే ఇంకా 26 మంది ఎమ్మె ల్యేలు తమతో టచ్‌లోకి రాలేదని స్పష్టం చేశారు. ఇక గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో రూ.300 కోట్లు ఖర్చు చేసి బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. మహాభారతంలో కర్ణుడిని ఓడించినట్లు తనను ఆ ఉప ఎన్నికల్లో ఓడించారన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల ఎఫెక్ట్ బీఆర్‌ఎస్‌పై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పడిందన్నారు. అందుకే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారని ఆయన సోదాహరణగా వివరించారు.