అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల తార శ్రీదేవి అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. దుబాయ్ లోని ఓ హోటల్ బాత్ టబ్ లో శ్రీదేవి చనిపోవడం ఆమె అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. శ్రీదేవి మరణంపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా మరోసారి స్పందించారు. తన భార్య సడెన్ గా చనిపోవడంతో దుబాయ్ పోలీసులు తనను సుదీర్ఘంగా విచారించారని తెలిపారు. దాదాపు 48 గంటల పాటు అన్ని రకాలుగా ప్రశ్నించి, శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని తేలడంతోనే తనను వదిలిపెట్టారని చెప్పారు.