A place where you need to follow for what happening in world cup

మానవత్వం చాటుకున్న హోంగార్డు నాగరాజు

  • వృద్ధురాలికి సాయంగా రోడ్డు దాటించిన వైనం
  • పోలీసులు అంటే పాషాణ హృదయమే కాదు సాయం చేసే గుణం కూడా ఉంటుంది

పోలీసుల కాకి యూనిఫామ్ మాటున కఠినత్వం దాగుంటుందని, వారు కర్కశ ఉదయం కలవారని చాలా కాలం నుంచి ఎంతోమంది అపోహలు పడుతుంటారు. నేటి పోలీసు వ్యవస్థలో అలాంటి అభిప్రాయానికి తావు లేకుండా ఉంది. ఎందుకంటే చట్టంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీసులు కూడా మామూలు మనుషులేనని వారికి స్పందించే గుణం ఉంటుందని సమస్యల పరిష్కారానికి వారు కూడా మానవత్వాన్ని జోడించి సాయం చేస్తారని సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. నిజానికి ప్రతి పౌరుడు కూడా యూనిఫాం లేని పోలిసే.సమాజ మంచిని హితాన్ని శాంతిభద్రతలను కాంక్షించే ప్రతివారు యూనిఫాం లేని పోలీసులే. అయితే ఎన్నో ఒత్తిడీలు టెన్షన్స్ మధ్యన పోలీస్ ఉద్యోగం అనేది ఒక కత్తి మీద సాములా నేటి సమాజంలో ఉందని చెప్పవచ్చు.

పోలీసులంటే ప్రజల సంక్షేమం కాంక్షించి భద్రతను కల్పించేవారు అని భావం రాను రాను వ్యవస్థలో బాగా నాటుకుపోయింది ఈ మార్పుకు తగ్గట్టుగా పోలీసులు కూడా అందుకు అనుగుణంగా సమస్యల పట్ల స్పందిస్తున్నారు. చేతనైన సహాయం చేస్తున్నారు ఆర్థికంగా ఆదుకుంటున్నారు ఇలా చెప్పుకుంటే పోతే నిత్యం మనిషి లేసిన దగ్గర నుండి పోలీస్ అనే వ్యక్తితో ఏదో ఒక రూపేనా రిలేషన్ కలిగి ఉంటూనే ఉన్నాము. పోలీసులు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తుంటారు వ్యక్తిగతంగా వారికి ఎవరి మీద పగా ప్రతికారాలు కక్షలుకార్పణ్యాలు ఉండవనేది నగ్న సత్యం వారు ఒక చర్య తీసుకుంటున్నారు అంటే అందుకు కారణం బలంగా ఉంటేనే వారు ముందుకు పోతారు తప్పించి కావాలని ఇతరులను ఇబ్బంది పెట్టి బాధలకు గురిచేయరనే విషయం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వారు భారత రాజ్యాంగం ప్రకారం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సానుకూలతతో ప్రవర్తిస్తూ అందుకు అనుగుణంగా చట్టాలను పరిరక్షిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లకు అనుగుణంగా చర్యలు తీసుకొని పోలీసు వృత్తికే ఉన్న తెచ్చేలా పోలీసులు వ్యవహరిస్తుంటారు. పోలీసులు ఎంతో కఠినత్వంతో ఉంటారని, చాలామంది భయపడుతుంటారు.కానీ అందుకు భిన్నంగా పోలీసులకు కూడా దయాగుణం,మమకారం ఉంటుందని నిరూపించారు ఈ హోంగార్డు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు పత్తేపు నాగరాజు ఒక వృద్ధురాలిని రోడ్డును దాటించిమానవత్వం చాటుకున్నారు. కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కింద కుడ కుడ వైపు వృద్ధురాలు రోడ్డు దాటేందుకు శనివారం మధ్యాహ్నం ప్రయత్నం చేస్తుంది.

కానీ ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో చాలాసేపు ఆమె చేస్తున్న ప్రయత్నం విఫలమైంది. గమనించిన ట్రాఫిక్ హోంగార్డు నాగరాజు ఆ వృద్ధురాలి చేయి పట్టు కొని రోడ్డును దాటించాడు. ట్రాఫిక్ హోంగార్డు నాగరాజు చేస్తున్న ప్రయత్నానికి వాహనదారులు కూడా సహకరించి ఆగి మరీ ఆశ్చర్యంగా చూశారు. పోలీసులకు కూడా దయాగుణం ఉంటుందని నిరూపించిన నాగరాజును పలువురు సలాం పోలీస్ అని అభినందించారు. పోలీస్ కు సహకరిద్దాం శాంతి భద్రతలను కాపాడే యజ్ఞంలో మనము భాగస్వాములు అవుదాం. సంఘవిద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉందాం. సమాజ రక్షణ కోసం రేయనక పగలనక ఎల్లవేళలా డ్యూటీలో ఉండే పోలీస్ అన్న నీకు వందనం అభివందనం.

Leave A Reply

Your email address will not be published.