హైదరాబాద్ పాత బస్తీ లని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు పోలీసు తుపాకీ మిస్ ఫైర్ అయింది. కబుతర్ ఖాన ప్రాంతంలో పికెట్లో విధులు ముగించుకొని పడుకునే క్రమంలో భూపతి విక్రమ్ అనే హెడ్ కానిస్టేబుల్ తన చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయింది.
దాంతో శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి పోలీసులు క్షతగాత్రడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అంతకుముందు ఘటనా స్థలాన్ని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య పరిశీలించారు..