- సంక్షేమ పథకాల మంజూరులో చోటామోటా నాయకుల చేతివాటం?
- తూర్పు గూడెం ఎమ్మెల్యే పర్యటనలో సంక్షేమ పథకాల అమలుపై నిరసన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు ,గృహలక్ష్మి ,బీసీ బంద్ పథకాలు తుంగతుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు సంతోషం కలిగిస్తుండగా లబ్ధి చేకూరని వారికి తీవ్ర నిరాశ కలిగిస్తుంది. తుంగతుర్తి మండలం లోని వివిధ గ్రామాలలో దళిత బంధు గృహలక్ష్మి బీసీ బందు పథకాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి .తాజాగా స్థానిక శాసనసభ్యుని తూర్పు గూడెం గ్రామ పర్యటనలో సంక్షేమ పథకాలు రాని వారి నుండి నిరసన సెగలు ప్రజ్వరెల్లాయి. శాసనసభ్యులు పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం సమావేశం పూర్తీ చేసి వెళ్ళిపోతున్న సమయంలో దళిత బంధు గృహలక్ష్మి పథకాలు తమకు దక్కలేదని అనర్హులకి ఇచ్చారని పలువురు గ్రామ మహిళలు ఆరోపించారు. దీంతో కొంతసేపు గందరగోల పరిస్థితి నెలకొన్నాయి.
స్థానిక టిఆర్ఎస్ నాయకులకు దళిత బంధు పై ఆరోపణలు చేస్తున్న వారికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది .అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఎమ్మెల్యే సభ ముగించుకుని వెళ్లిపోయారు ఎమ్మెల్యే పర్యటనకు బందోబస్తుగా వచ్చిన పోలీసులు ఘర్షణ పడుతున్న వారిని సముదాయించే ప్రయత్నం చేశారు .అయినా మహిళలు శాంతించక తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దళిత బంధు న్యాయబద్ధంగా ఇవ్వకుండా కమిషన్ ఇచ్చిన వారికి ఇస్తున్నారని పలువురు ఆరోపించారు. చివరికి పోలీసులు వారిని సభా స్థలం నుండి బయటికి పంపించారు .ఇలాంటి పరిస్థితులే మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది .గృహలక్ష్మి పథకంపై అసలు ఇల్లు లేని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇల్లు ఉన్నవారికి ముడుపులు తీసుకుని ఇల్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు .తాము గత పది సంవత్సరాలుగా ఇల్లు వస్తాయని ఆశగా ఉన్నామని కానీ దళారులు అనర్హుల వద్ద పైసలు తీసుకుని అర్హులకు రాకుండా చేశారని ఇల్లు లేని వారు ఆరోపిస్తున్నారు .
బీసీ బందులో కూడా డబ్బులు డబ్బులు పుచ్చుకునే అనర్హులకు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గృహలక్ష్మికి సంబంధించి వెంపటి గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు గతంలో ఆందోళన చేపట్టారు .దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి పథకాలలో చోటా మోటా నాయకుల చేతివాటం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది బాహటంగానే డబ్బులు వసూలు చేసినట్లు పేర్లు చెప్పడానికి ఇష్టపడని లబ్ధిదారులు చెబుతున్నారు. తీరా ఎన్నికల కోడ్ రావడం తో దళిత బంధు లబ్ధిదారులకు నిరాశ ఎదురయింది. ఎన్నికల అనంతరమే దళిత బంధు పథకం అమలవుతుందని మాట చెప్పడంతో ప్రభుత్వ సహాయం రాణి విషయం పక్కన ఉంచితే తమకు మంజూరు చేసినామని చెప్పి డబ్బులు తీసుకున్న వారికి అప్పు తెచ్చి ఇచ్చామని మాట పలువురు గుసగుస లాడుకుంటున్నట్లు తెలుస్తోంది బయటకు చెబితే ఏమవుతుందో అనే భయంతో వారిలో వారే తర్జనభర్జన అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దళిత బంధు ,బీసీ బందు, గృహలక్ష్మి పథకాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయా? లేక వాటి వల్ల రగిలిన అసమ్మతి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనే మాట చర్చనీయాంశంగా మారింది .విపక్షాలకు విమర్శ నాస్త్రంగా ఈ మూడు పథకాలు మారుతాయని పలువురు అంటున్నారు .సంక్షేమ పథక లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసిన వారిలో ఒక నాయకుడు ఏకంగా తన వాహన ఈఎంఐ కట్టుకోవాలని అందువల్ల డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు సంక్షేమ పథకాలలో చోటు చేసుకోవడం వల్ల అవి పార్టీకి మేలు చేస్తాయా కీడు చేస్తాయా అనేది ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారాన్ని అధికార పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చిందా? చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారా? సంక్షేమ పథకాల అ ఆసమ్మతిని చల్లార్చడానికి ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పట్ల అధిష్టానం చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందని మాట వినవస్తుంది. ఏది ఏమైనా సంక్షేమ పథకాల ఆందోళన ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.