జ్యుడీషియల్ కస్టడీ జూలై-22 వరకు పొడిగింపు
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో చికిత్స పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై-22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించింది. కవిత .అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న ఆమెను మంగళవారం దిల్లీలోని దీన్ దయాల్ హాస్పిటల్‌కి• తరలించి సుమారు రెండు గంటలపాటు చికిత్స చేయగా కుదుటపడ్డారు. హాస్పిటల్ నుంచి మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.
కాగా.. కవితకు వైద్య పరీక్షల కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎయిమ్స్ హాస్పిటల్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు.. కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కోర్టు సూచించింది. కాగా.. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను మొత్తం పూసగుచ్చినట్లుగా న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు.
అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించి నట్లుగా కోర్టుకు సీబీఐ, ఈడీ తరఫున లాయర్లు వివరించారు. గురువారం విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్ కోసం కవిత తరపున న్యాయవాదులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఎయిమ్స్‌లో కవిత ఆరోగ్య పరీక్షలకు న్యాయస్థానం ఆదేశిం చింది. పరీక్షల అనంతరం ఇందుకు సంబంధించి పూర్తి నివేది కను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. ఇవాళ లేదా రేపు కవితను కలవ డానికి బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు దిల్లీ వెళ్లను న్నట్లు తెలుస్తోంది.