- కలికో నుంచి చింతకుంట వరకు 100 కార్లతో ర్యాలీ
- వేములవాడ బీఆర్ఎస్ లో జోష్..
- ఎన్నికల నోటీఫీకేషన్కు ముందే రాజకీయ సందడి
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహా రావు ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎన్నికల నోటీపీకేషన్కు ముందే వేములవాడ లో రాజకీయ సందడి నెలకొంది. గురువారం వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలంలో పర్యటించారు. కలికోట నుంచి చింతకుంట వరకు బీఆర్ఎస్ శ్రేణులు చల్మెడను 100 కార్లతో బారి ర్యాలీ నిర్వహించి గ్రామంలోకి స్వాగతించారు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఆధ్వర్యంలో చల్మెడను పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి.. ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించాక వేములవాడ బీఆర్ఎస్ లో రాజకీయ వాతావరణం మారిపోయింది. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం చల్మెడ వైపు రావడంతో పాటు చల్మెడ గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. నిత్యం రాజకీయ సమావేశాలు.. ఇతర పర్యటనలతో చల్మెడ లక్ష్మీనరసింహారావు వేములవాడ నియోజక వర్గంలో పర్యటనలు చేస్తున్నారు.
ఫోటో:
చల్మెడ లక్ష్మీనరసింహా రావు కారు ర్యాలీ
కథలాపూర్ మండలంలో మాట్లాడుతున్న చల్మెడ