A place where you need to follow for what happening in world cup

15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15 న ప్రగతి భవన్‌లో నిర్వహించనున్నారు . సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరపనున్నారు గులాబీ నేతలు. పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం నవంబర్ మూడో వారం ముగిసిన తర్వాత శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ వర్షకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిసాయి. అయితే ఇవి ముగిసిన 40 రోజుల్లోపే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చనీయం అవుతోంది.అసలు ఈ సమావేశాలను ఎందుకు ముందుగానే జరుపుతున్నారనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

దీంతో వివిధ వర్గాలు భిన్న అంచనాలు వేస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించేందుకు పార్లమెంటును సమావేశపరుస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. అలాగే ఎన్నికలకు ముందు ఉమ్మడి పౌరస్మృతి అమలు, ఓబీసీ వర్గీకరణకు జస్టిస్ రోహిణి కమిషన్ చేసిన సిఫార్సుల ఆమోదం వంటివి చర్చించేందుకే అని పలువురు చెబుతున్నారు. అలాగే ఈ సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును కేంద్రం తీసుకురానుందని ఇటీవల జోరుగా ప్రచారాలు సాగాయి. వాస్తవానికి శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు రాజ్యంగంలో అయిదు ఆర్టికల్స్‌ను సవరించాల్సి ఉంటుంది. అలాగే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కూడా సాధించాల్సి ఉంటుంది.అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఎన్నికలకు అదనంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సేకరించాల్సి ఉంటుంది. అలాగే వీటన్నింటిపైన నిర్ణయ తీసుకునేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముందుగా నిర్వహించనున్నారున్న ఊహగాణాలు ఉన్నాయి. అయితే ఈ సమావేశాలను పార్లమెంట్ నూతన భవనంలో నిర్వహించే అవకాశం ఉంది. ఇదిల ఉండగా ఈ ఏడాది చివర్లో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాదిలో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, హర్యాణా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైపు జమిలి ఎన్నికలు నిర్వహిస్తారని కొందరు నేతలు చెబుతుండగా.. మరికొందరు నేతలు వాటిని ఖండిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎలాంటి ప్రతిపాదనలు చేయనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఏం జరగనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.