వర్షాల వలన లోతట్టు ప్రాంతాలు మునిగిన సందర్భంలో ధరణి నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, షిరిడీ నగర్ లో బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ మంగళవారం పర్యటించారు. గత రెండు రోజుల నుండి ఎడ తెరపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరదలో చిక్కుకొని ఉండడం బాధాకరమని అన్నారు.ముంపు ప్రాంతాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అనేక వేదికల మీద చెప్పినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్కసారి మీరు ఇప్పుడు హైదరాబాద్ నగరం తిరుగుతే మీకు అర్థమవుతుంది మీరు ఎంతవరకు కృషి చేశారు తెలుస్తది అన్నారు.
చెరువులు నాళాలు కబ్జాకు గురి కావడం వలన వర్షపు నీరు పూర్తిగా రోడ్లమీదకి కాలనీలలో ఇండ్ల మధ్యలో ఉండి ఇండ్లు,కాలనీ లు చెరువులను కుంటలను తలపించే విధంగా కనపడుతున్నాయి అన్నారు,. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ లు ధరణి నగర్ నాలా సమస్యను శాశ్వత పరిష్కారం చేశామని గొప్పలు చెప్పారు ఇపుడు ఒక్కసారి వచ్చి చూడండి మీ గొప్పలు,చిప్పలు తెలుస్తాయి అన్నారు.అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు అన్నారు. మ్యాన్ హోల్ మూతలు తెరుచుకుని ఉన్నాయి వాటిలో పడే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎవరు చిన్నపిల్లల్ని బయటికి రాకుండా చూసుకోవాలని అన్నారు.