ఏలూరు:జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కోనసీమ జిల్లాలు విజయవంతంగా ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రవేశించడంతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు జనసైనికులు జనసేన వీర మహిళలు భారీగా నరసాపురం చేరుకుని పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం పార్టీ క్యాడర్ తో సమావేశమై పార్టీ బలబలాలపై చర్చించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ రాకతో నరసాపురంలో సందడి వాతావరణం నెలకొంది.