కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తమ పొట్టను కొడుతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆటో యూనియన్ నాయకులు గురువారం మంగపేట మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలకు ఉచిత రవాణా మంచి పథకమే కానీ…
ఇది వాహనరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడుతున్నాయన్నారు. వాహన రంగాన్ని, తమ ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తక్షణమే ఆటో డ్రైవర్లకు మార్గం చూపించాలని విజ్ఞప్తి చేశారు.