కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ దాదాపు నిర్ణయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వారు కాంగ్రెస్‌లో చేరుతున్నారని… అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మూడు నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయనిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం… పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ ఉంది. ఆ రోజున దానంపై అనర్హత వేటు పడకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ దాదాపు నిర్ణయించింది. దానంతో పాటు పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలపై కూడా ఒకేసారి వెళ్లాలని నిర్ణయించింది.