A place where you need to follow for what happening in world cup

అనిశ్చితి నుంచి అభివృద్ది దిశగా మా పదేళ్ల పాలన

అప్పులే కాదు..సంపద సృష్టించి ఇచ్చాం
కొరోనాతో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం
బట్ట కాల్చి విూద వేసేలా కాంగ్రెస్‌ పాలన

ద్రవ్య వినిమయ చర్చలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని, బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని రేవంత్‌ రెడ్డి సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. శాసనసభలో ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. పదేండ్ల నాడు జూన్‌ 2014లో ఒక అనిశ్చిత పరిస్థితి ఉండేదని, కానీ ఈ రోజు గర్వంగా చెప్పొచ్చునని, సభకు ఇచ్చిన సోషియో ఎకానమిక్‌ అవుట్‌ లుక్‌లో తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. 2022 మార్చి 15న ఇదే సభలో ప్రతిపక్ష హోదాలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రతి సంవత్సరం సంపద సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కొరోనా అతాలకుతలం చేసినప్పటికీ ఆ దాడిని తట్టుకోని ఉత్పత్తిని, సంపదను పెంచడం జరిగిందన్నారు. అక్కడ కూర్చోగానే స్వరం మారిందని, అయినప్పటికీ వారు ఇచ్చిన అవుట్‌ లుక్‌లోనే అన్ని విషయాలు వివరంగా చెప్పారన్నారు.

 

ఇందులో వాస్తవాలు బయటపడ్డాయని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటని, ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ.. ఉజ్వల తెలంగాణగా ఎదుగుతుందని, ఇందులో రెండో మాట అవసరం లేదని, ఇప్పుడు ఎన్నికలు లేవని, నాలుగున్నరేండ్ల పాటు కలిసిమెలిసి పని చేసుకోవాలని, వారికి ప్రజలు అవకాశం ఇచ్చారని, డిసెంబర్‌ 3న చెప్పామని, పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామన్నామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ వారు తీసుకునే నిర్ణయాత్మక అంశాలపై సహకారం అందిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మొన్న కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. శుష్క ప్రియాలు ..శూన్య హస్తాలు, గ్యారెంటీలకు టాటా.. లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా.. డైవర్షన్ల మేళా.., హావిూ పత్రాలకు పాతర.. శ్వేత పత్రాల జాతర, నిరుద్యోగుల విూద నిర్బంధాలు, జర్నలిస్టుల విూద దౌర్జన్యాలు, విమర్శస్తే కేసులు..ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు.. ఆటో అన్నల బలవన్మరణాలు, వోట్లకు ముందు అభయ హస్తం.. వోట్లు పడ్డాక శూన్య హస్తం, మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం.. బ్జడెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం, మూడు తిట్లు.. ఆరు అబద్దాలతో పొద్దున లేస్తే బట్ట కాల్చి విూద వేసే పనులు ఇందులో కనబడుతున్నాయని కేటీఆర్‌ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో విమర్శ కోసం విమర్శ చేయొద్దని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా కొన్ని డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చురకలంటించారు.

 

2014లో రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్‌తో అప్పజెప్పితే అప్పులపాలు, అప్పులకుప్ప చేశారని కాంగ్రెస్‌ నేతలు అనడం సరికాదని, 2014లో రెవెన్యూ సర్‌ ప్లస్‌ రూ. 369 కోట్లు. 2022`23లో రెవెన్యూ సర్‌ప్లస్‌ రూ. 5,944 కోట్లతో ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పజెప్పామని, ఇది వాస్తవం కాదా..అంటూ ప్రశ్నించారు. వారు ప్రవేశపెట్టిన 2024 బ్జడెట్‌లో రెవెన్యూ సర్‌ప్లస్‌ 297 కోట్లని, తమకు రూ. 369 కోట్లతో అప్పజెప్పితే రూ. 5944 కోట్లతో అప్పజెప్పామని, ఇది తప్పా..లని ప్రశ్నిస్తూ.. అప్పుల పాలైందని ఎలా అంటారన్నారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి అనడం సరికాదని కేటీఆర్‌ పేర్కొన్నారు. కొరోనా వల్ల ఆర్థిక నష్టం జరిగినప్పటికీ కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్‌కు ఇచ్చే డబ్బులు ఆపొద్దని చెప్పి వాటికి ఇచ్చామని, ఉద్యోగులకు కొందరికి జీతాలు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చునని అన్నారు. అప్పులు రెవెన్యూ రిసిట్స్‌కు లోబడి ఉన్నాయని, రెవెన్యూ సర్‌ప్లస్‌లో ఉన్నామంటే జీతాల కోసం అప్పులు చేసే పరిస్థితి లేదని, ఎస్‌వోటీఆర్‌లో అంటే సొంత వనరుల్లో తెలంగాణ టాప్‌లో ఉందని, దయచేసి తప్పు ప్రచారం మానుకోవాలని కెటిఆర్‌ అన్నారు.

 

పదేండ్ల ప్రస్థానంలో తెలంగాణ తన సొంత కాళ్ల విూద నిటారుగా నిలబడ్డదని, అనేక మంది శాపనార్థాలను తట్టుకుని, సవాళ్లను అధిగమించి ఇవాళ తెలంగాణ సిరిసిపందలతో బారతదేశ భాగ్యరేఖలను మార్చే రాష్ట్రంగా అగ్రభాగాన నిలబడిరదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్బీఐ గణాంకాలు నిజాలను నిగ్గు తేలస్తున్నాయని, సత్యాల విూద ముసుగులు వేయడం అంత సులభం కాదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. భారతదేశంలోనే తెలంగాణ 74 శాతం డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పెండిరచర్‌తో అగ్రభాగాన ఉన్నట్లు ఆర్బీఐ లెక్కలను సోషియో ఎకానమిక్‌ అవుట్‌ లుక్‌లో కోట్‌ చేశారన్నారు. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే మనం చాలా బెటర్‌గా ఉన్నామని, తెలంగాణలో రూపాయిలో కమిటెడ్‌ ఎక్స్‌పెండిచర్‌ 47 పోతే 53 పైసలు అదనంగా ఉన్నాయని, కేరళలో 82 పైసలు, హర్యానాలో 81 పైసలు, పంజాబ్‌లో 79 పైసలు, వెస్ట్‌ బెంగాల్‌లో 69, ఏపీలో 61, రాజస్థాన్‌లో 59 పైసలు కమిటెడ్‌ ఎక్స్‌పెండిచర్‌ కింద పోతున్నాయన్నారు. జాతీయ సగటు 56 పైసలని, కమిటెడ్‌ ఎక్స్‌పెండిచర్‌లో అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, తిమ్మినిబమ్మి చేయొద్దని సూచిస్తున్నానని, వడ్డీలు, జీతాల కోసం డబ్బులు సరిపోవట్లేదని వారు మాట్లాడడం సరికాదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.