A place where you need to follow for what happening in world cup

కెసిఆర్‌ బస్సు యాత్రతో కాంగ్రెస్‌, బిజెపిల్లో దడ

0 721

అందుకే ఆగమేఘాల మీద 48 గంటల నిషేధం
కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఈసి
మా ఫిర్యాదులపై మాత్రం పట్టింపు లేదు
రేవంత్‌ భాషపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్‌
మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్‌, బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ బస్సు యాత్రకు వొస్తున్న ప్రజా స్పందనను చూసి ఆ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. అందుకే మోదీ, రేవంత్‌ ఒక్కటై ఈసితో నిషేధం విధించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ వ్నిడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన పరుష పదజాలం వ్నిద ఎన్నికల సంఘానికి 8 ఫిర్యాదులు ఇచ్చి కానీ చర్యల్లేవన్నారు. కేసీఆర్‌ను ఉరితీస్తాం.. లాగుల తొండలు వదులుతాం..ముడ్డి వ్నిద డ్రాయర్‌ కూడా ఉండదు..కేసీఆర్‌ తల నరకండి..కేసీఆర్‌ తల తెగ్గోయండని రేవంత్‌ రెడ్డి మాట్లాడారని, ఈ మాటలు ఎన్నికల సంఘానికి నీతిసూక్తులు, సుభాషితాల్లాగా వినబడుతున్నట్లుందంటూ కెటిఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ మాటలు ఈసీకి వినిపించవని, అదే కేసీఆర్‌ నేతన్నలు, రైతుల పక్షాన మాట్లాడితే గట్టిగా ఒక్క మాట మాట్లాడితే.. 48 గంటల నిషేధం విధించారని కేటీఆర్‌ తెలిపారు. బడా భాయ్‌.. చోటా భాయ్‌ కన్నుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం పని చేయకపోతే.. తామిచ్చిన 27 ఫిర్యాదులపై స్పందించాలన్నారు. రేవంత్‌ వ్నిద 8, మరో 19 ఫిర్యాదులు మిగతా పార్టీ నాయకులు, వారి వైఖరి వ్నిద ఈసీకి ఫిర్యాదు చేశామని, ఒక్కటంటే ఒక్కదాని వ్నిద కూడా చర్య లేదని, కొండా సురేఖకు మందలింపు తప్ప ఒక్కటంటే ఒక్క చర్య లేదని, వారి ప్రచారాన్ని నిషేధించలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభించగానే కాంగ్రెస్‌కు, బీజేపీకి దడ పుట్టిందని, స్టేట్‌లో ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌, కేంద్రంలో ఐబీ రిపోర్టు ఎప్పటికప్పుడు ఇస్తున్నాయని, కేసీఆర్‌ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మంచి స్పందన వొస్తుందని ఆ పార్టీలకు కంటగింపుగా మారిందన్నారు.

2014లో బడా భాయ్‌ చేసిన మోసం, 2023లో చోటా భాయ్‌ చేసిన మోసాన్ని పూసగుచ్చినట్టు ప్రజలకు వివరిస్తుంటే.. తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇది ఒక పన్నాగమనేది పార్టీ స్థిరమైన అభిప్రాయమని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ బస్సు యాత్రకు జనస్పందన చూసిన తర్వాత రెండు పార్టీలకు నిద్ర పట్టడం లేదని, 8-12 సీట్లు బీఆర్‌ఎస్‌కు వొస్తున్నాయని సర్వేలు వొస్తున్నాయని, మొన్నటి దాకా బీఆర్‌ఎస్‌ను ఒక్క సీటు కూడా గెలవనివ్వమని అన్నారని, కేసీఆర్‌ బస్సు యాత్ర తర్వాత వొస్తున్న స్పందనను జీర్ణించుకోలేక ఇద్దరు కూడబలుక్కొని కేసీఆర్‌ను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా ఆపడం అప్రజాస్వామిక చర్య అని, ప్రజలు దీనికి వోటుతోనే సమాధానం చెప్తారని అనుకుంటున్నానని కేటీఆర్‌ తెలిపారు. రేవంత్‌ రెడ్డి ఇంకా చండాలంగా మాట్లాడారని, ఆ మాటలను అనేందుకు తమకు సిగ్గనిపిస్తుందని, ఆయన మాటలపై ఫిర్యాదు చేస్తే.. గోడకు చెప్పుకున్నట్టే ఉంది కానీ ఈసీ నుంచి స్పందన లేదన్నారు. కానీ కేసీఆర్‌ పట్ల రాకెట్‌ వేగంతో స్పందించి నిషేధం విధించారని, వారిది నిజంగా స్వయం ప్రతిపత్తి సంస్థ అయితే.. ఎందుకు మోదీ వ్నిద చర్యల్లేవంటూ కెటిఆర్‌ ప్రశ్నించారు. మోదీకి నోటీసులు ఇవ్వాలంటే ఎందుకు వణికి చచ్చిపోతున్నారని , నడ్డాకు ఎందుకు ఇస్తున్నారన్నారు. రేవంత్‌ రెడ్డి విషయంలో వారి గొంతు ఎందుకు పెగడలం లేదని, 48 గంటల పాటు కేసీఆర్‌ ప్రచారాన్ని నిషేధించొచ్చు కానీ కేసీఆర్‌ తయారు చేసిన సైన్యాన్ని వ్నిరు అడ్డుకోలేరని కేటీఆర్‌ అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మోదీకి, అమిత్‌ షాకు నోటీసులు జారీ చేయరు కానీ ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్‌కు మాత్రం నోటీసులు జారీ చేసి, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్‌ తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వారు తీసుకున్న నిర్ణయాలు దానికి అనుగుణంగా జరిగిన నియామకాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆటాడిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. చివరకు ఎన్నికల కమిషన్‌ కూడా బీజేపీ కనుసన్నల్లో నడుస్తుందని, ఇందులో ఎలాంటి రెండో ఆలోచన, అభిప్రాయం తమకు లేదన్నారు. దేశంలో బీజేపీ వాళ్లు జాతులు, మతాల ఆధారంగా.. ప్రధాని, హోమ్‌ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా దారుణమైన వ్యాఖ్యలు చేసినా, ప్రత్యర్థ పార్టీలను బీజేపీ నాయకులు బండబూతులు తిడుతున్నా.. వాళ్ల బీజేపీ 4 ఇండియా అఫిషియల్‌ ట్విట్టర్‌ ముస్లిమ్‌లపై విషం చిమ్ముతూ.. ప్రచారం చేస్తున్నా ఒక్క చర్య లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని కేటీఆర్‌ తెలిపారు. ఇటీవలే మోదీ దారుణంగా మాట్లాడారని, ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, వేరే వారు అధికారంలోకి వొస్తే దేశ సంపదను ముస్లింలకు దోచి, పంచి పెడుతారని ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే దాదాపు 25 వేల మంది పౌరులు ఎన్నికల కమిషన్‌కు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారని, కానీ కనీసం మోదీకి నోటీసు కూడా ఇవ్వలేదని, చర్యలు తీసుకోవడం లేదని, మోదీకి భయపడ్డ ఎన్నికల సంఘం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులు జారీ చేశారన్నారు. మోదీ వ్యాఖ్యలపై నడ్డా జవాబు ఇవ్వాలని తలాతోక లేని నిర్ణయం ఎన్నికల కమిషన్‌ తీసుకుందని కేటీఆర్‌ గుర్తు చేశారు.

ఎన్నికల్లో దేవుడిని, మతాన్ని ఇన్‌వాల్వ్‌ చేయడం నేరమని, అమిత్‌ షా శ్రీరాముడి బొమ్మ పట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారని, దీనిపై కూడా ఫిర్యాదు చేశారని, ఎన్నికల కమిషన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కెటిఆర్‌ నిలదీశారు. అయినా ఉలుకు పలుకు లేదని, బీజేపీ అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ గతంలో రామాయణం సిరీయల్‌లో రాముడి పాత్ర పోషించారని, ఆయన రాముడి ఫొటోతో ప్రచారం చేశారని, చర్య, నోటీసులు లేదని, బీజేపీ4 ఇండియా అఫిసియల్‌ ట్విట్టర్‌లో రాముడి ఫోటో పెట్టి వ్ని వోటును బీజేపీకి వేయాలని ప్రేరేపిస్తున్నారని, మోదీ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినా, హోమ్‌ శాఖ మంత్రి రాముడి ఫొటో పట్టుకుని వోట్లు అడిగానా ఉలుకు పలుకు లేదని, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, హిందూ ముస్లిమ్‌లను విడదీసేలా బీజేపీ4ఇండియా దాడి చేసినా ఎన్నికల కమిషన్‌ మేల్కోవడం లేదని కెటిఆర్‌ మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.