A place where you need to follow for what happening in world cup

గోదావరి ఇసుక తవ్వకాలపై ఎన్టీటీ స్టే రాష్ట్ర ప్రభుత్వానికి షాక్

సీతమ్మ సాగర్ పూడిక పేరుతో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పూడిక పేరుతో దొడ్డిదారిన జరుగుతున్న ఇసుక తవ్వకాలు చట్ట విరుద్ధమంటూ ములుగు జిల్లాకు చెందిన పూనెం రాములు తదితరులు దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ నెల 11 న ఎన్టీటీ దక్షిణాది రాష్ట్రాల బెంచ్ విచారణ చేపట్టింది.

మంగపేట మండలంలోని మూడు ఇసుక రీచ్ లలో దాదాపు 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం అప్పటి ములుగు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను దరఖాస్తుదారులు సవాలు చేశారు. రిజర్వాయర్ల పూడిక కోసం పర్యావరణ అనుమతులను మినహాయిస్తూ 2006 లో ఇచ్చిన పర్యావరణ నోటిఫికేషన్ ను సుప్రీం కోర్టు తప్పుపట్టిన విషయాన్ని ఎన్టీటీ గుర్తు చేసింది.

సీతమ్మసాగర్ పూడికను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో కొన్ని పిటిషన్లు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నందువల్ల ఎన్టీటీలో విచారణ చేపట్టవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలతో ఎన్టీటీ ఏకీభవించలేదు. తదుపరి విచారణను ఈ నెల 21 కి వాయిదా వేస్తూ అప్పటి లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్టీటీ ఆదేశించింది. నోబుల్ ఎమ్. పైకాడ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది.

[pdf-embedder url=”https://www.relanews.com/wp-content/uploads/2026/08/178661972421453865766a7da74c97410.pdf”]

పర్యావరణ అనుమతుల మినహాయింపు అన్నింటికి వర్తించదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని తెలిపింది. లైనియర్ ప్రాజెక్టులను, వాటి నిర్వహణను సక్రమంగా నిర్వచించక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. పర్యావరణ అనుమతుల మినహాయింపు నిబంధనలను సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపధ్యంలో సీతమ్మసాగర్ పూడికపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.