A place where you need to follow for what happening in world cup

రూ. 60 వేలకు చేరిన బంగారం

0 202

బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. గురువారం తులం బంగారంపై సుమారు రూ. 300 పెరగగా, శుక్రవారం కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. డాలర్‌ విలువ పుంజుకున్న తర్వాత కూడా బంగారం ధరల్లో పెరుగదల కనిపించడం గమనార్హం. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేలు దాటేసింది. ఇక రోజురోజుకీ బంగారం ధరలో పెరుగదల కనిపిస్తూనే ఉంది. తాజాగా శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది.

* ఢిల్లీలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 గా ఉంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 55,150 , 24 క్యారెట్స్‌ ధర రూ. 60,1603 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ రూ. 55,150 , 24 క్యారెట్ల ధర రూ. 60,160 గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,450 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,150 గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 గా ఉంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 55,150 , 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
* వరంగల్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధరూ. 55,150 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150 , 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,150 , 24 క్యారెట్స్‌ ధర రూ. 60160 గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో మార్పులు కనిపించలేదు. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు కిలో వెండి ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,600 , చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,700 , బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 గా ఉండగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 80,700గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 80,700వద్ద కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.