A place where you need to follow for what happening in world cup

రేవంత్ పై కుట్ర..

  • బీజేపీ బీఆర్ఎస్ నేతల మైండ్ గేమ్
  • సీఎం మారతారంటూ ప్రచారం
  • బలహీనమైన ముఖ్యమంత్రి కోసం విపక్షాల ప్రయత్నం
  • హస్తం పార్టీలో కొందరు నేతలతో నిరంతరం మంతనాలు

రాష్ట్రంలో సీఎం మారతారంటూ కొందరు విపక్ష నేతలు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. రాష్ట్రంలో బలహీనమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటే రాబోయే ఎన్నికల్లో తమ పని సులువుగా పూర్తవుతుందని భావిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఇటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై నియమించిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుతున్న తరుణంలో తమపై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారోననే భయం బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నది. జూన్ ఐదవ తేదీన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి.

ప్రజల అటెన్షన్ ను కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈడీ కేసువైపు మళ్ళించడానికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. కమేడియన్ బ్రహ్మానందం కంటే ఎక్కువ హాస్యం పండించారు. మరో వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక వైపు కాళేశ్వరం మకిలి అంటించుకుని బయట పడలేని స్థితిలో ఉండగా మరో వైపు కవిత లేఖతో దుమారం రేగడాన్ని జీర్ణించుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్న బీఆర్ఎస్ నేతలు డైవర్షన్ పోలిటిక్స్ చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఏకమయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానా కొనసాగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కగా మధ్యలో సీఎం మార్పు పేరుతో హీట్ మరింత పెంచుటున్నారు.

కాంగ్రెస్ లో కోవర్టులు..

సీఎం రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెంలా కొందరు నేతలు తయారయ్యారు. బలహీనమైన ముఖ్యమంత్రి అభ్యర్ధులు కూడా వీరిలో ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, నల్లగొండ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అవకాశం కోసం

ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరిగితే అసమ్మతి చెలరేగుతుందని, రేవంత్ రెడ్డి పీఠం కదులుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్న కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు భారీగా లబ్ది పొందనట్లు ఆరోపణలు వచ్చాయి.

వ్యూహ ప్రతివ్యాహాల్లో రేవంత్ దిట్ట..

తనది కాని పార్టీలో చేరి హేమా హేమీలైన సీనియర్లను పాతాళంలోకి తొక్కి తక్కువ సమయంలోనే సీఎం పీఠాన్ని ఎక్కిన రేవంత్ రెడ్డి కూడా వ్యహ ప్రతివ్యూహాల్లో దిట్టగా చెప్పవచ్చు. ప్రస్తుత పరిణామాలను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో 40 మంది ఎమ్మెల్యేల బలం కలిగిన రేవంత్ పై

నేరుగా యుద్ధం చేసే శక్తి ఇప్పటికిప్పుడు ఎవరికీ లేదు. అందుకే ఈడీ కేసులో ఏదైనా జరిగితే అది తమకు అనుకూలిస్తుందనే ఆశ లో ఇటు కోవర్టు మంత్రులు ఉండగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మరో పదేండ్ల కాలం తానే సీఎం గా ఉంటానని రేవంత్ రెడ్డి అనేక మార్లు ప్రకటించారు. దీని వెనుక ధీమాతో పాటు

తగిన కార్యాచరణ కూడా ఉందనే అనుకోవాలి. కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా ఇప్పటికిప్పుడు రేవంత్ కన్నా బెటర్ ఆప్షన్ లేదనే చెప్పాలి. ఒక దశలో రాహుల్ గాంధీకి రేవంత్ కి మధ్య చెడిందనే ప్రచారాన్ని కూడా కోవర్టు నేతలు ప్రతిపక్షాలు పనికట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. ఇటువంటి ఎత్తుగడల వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. రేవంత్ అనుచరులైన పది మంది ఎమ్మెల్యేలు కూడా కోవర్టు నేతల వ్యవహారాన్ని అధిష్ఠాన వర్గానికి చేరవేశాయి. ప్రజల్లో బలం లేని నేతను సీఎం చేస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా ఎవరకీ తెలియదు. గతంలో 1981, 1989 కాలంలో సీఎం ల ను తరచూ మార్చడం ద్వారా వచ్చిన అనుభవాలతో కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.