A place where you need to follow for what happening in world cup

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద పోస్టు

తమిళనాడు డీఎంకే నేత‌, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్‌ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉదయనిధి మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స్టాలిన్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్ ఫొటోను ఉద‌య‌నిధి స్టాలిన్ పోస్ట్ చేశాడు. అయితే దీనికి ఎటువంటి క్యాప్ష‌న్ ఇవ్వ‌లేదు. ఇక ఈ ఫొటో ‘సనాతన ధర్మం’ (పై స్టాలిన్ చేసిన డెంగీ, మలేరియా వ్యాఖ్య‌లను గుర్తుకుతెస్తుంది. కాగా.. ఈ ఫొటోపై నెటిజెన్లు స్పందిస్తూ.. విమర్శలను ఎలా స్వీకరించాలో, సంఘీలను ఎలా ఇబ్బంది పెట్టాలో ఉద‌య‌నిధి స్టాలిన్‌కు బాగా తెలుసంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>