A place where you need to follow for what happening in world cup

అమిత్ షా కు రియాల్టీ రిపోర్ట్….

తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీ.. వ్యూహాలకు పదునుపెట్టి దూసుకెళ్తోంది. అసలు గ్రౌండ్ లెవల్లో ప్రజల నాడి ఎలా ఉంది..? ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? లేదా..? ఈ క్రమంలో ఎలాంటి లోపాలున్నాయి. నియోజకవర్గాల్లో పల్స్.. రాష్ట్ర కమిటీ పనితీరు ఎలా ఉంది..? ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది.. ఎవరు ఎలాంటి వారు.. ఇదంతా గ్రౌండ్ లెవల్ రిపోర్ట్.. కానీ ఇదే కావాల్సింది.. అందుకే రహస్యంగా.. అదంతా బయటకు కనిపించడకుండా లోపలే మేనేజ్‌ చేశారు. వారం రోజులుగా వాళ్లంతా తెలంగాణలోని నియోజకవర్గాల్లో తిరిగారు.. బీజేపీకి పబ్లిక్‌లో రూట్‌ లెవెల్లో ఎలా ఉందో ఇన్ఫర్మేషన్‌ సేకరించారు.

పార్టీకి ప్లస్సులు.. మైనస్సులు ఏంటో ఇవాళ అమిత్‌ షాకు రిపోర్ట్‌ ఇచ్చారు. వాళ్ల ఫీడ్‌ బ్యాక్‌ మొత్తం అమిత్‌ షాకు అందజేశారు. దీని ప్రకారమే.. అధిష్టానం.. మరో ప్లాన్ బీని  కూడా సిద్ధం చేయనుదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండడంతో ఈసారి ఎలాగైనా తెలంగాణలో జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను బీజేపీ హైకమాండ్ పంపించింది. ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్నాటక, పుదుచ్చేరి, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు వారం కిందటే తెలంగాణలో దిగారు.. వాళ్లంతా వారం రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లోనే ఉన్నారు..

వీళ్ల పనేంటంటే.. పార్టీ లోకల్ లీడర్లు, మండల, బూత్ స్థాయి కార్యకర్తలను కలిసి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి? పార్టీ బలోపేతం, బూత్ కమిటీల పనితీరు, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఉన్న అవకాశాలు, టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? తదితర విషయాలపై హైకమాండ్కు నివేదిక అందజేస్తారు. ఆ నివేదికల ఆధారంగానే హైకమాండ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను రచించనుంది.అయితే.. తెలంగాణలోని ఏ మూలకెళ్లినా.. పబ్లిక్‌.. బండి సంజయ్‌ మేటరే గుర్తు చేశారట.. బండిని తప్పించడంపై నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు సమాచారం.

మరో మెయిన్‌ పాయింట్‌ ఏంటంటే.. కవిత విషయంలో కేంద్ర పెద్దలు వ్యవహరించిన తీరుపైనా పబ్లిక్‌ మండిపడుతున్నారట..ఈ రెండు తెలంగాణ బీజేపీకి పెద్ద మైనస్‌ పాయింట్లుగా..ఎమ్మెల్యేలతో జనం చెబుతున్నారట.. ఈ విషయాలే అమిత్‌ షా చెవిలో పడేయాలని.. వాళ్లంతా తహతహలాడుతున్నారని టాక్.. మరి ఈ రిపోర్ట్‌పై ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో..ఏమో.. గానీ.. బీజేపీ ఎమ్మెల్యే రిపోర్ట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది..

Leave A Reply

Your email address will not be published.