A place where you need to follow for what happening in world cup

గులాబీ గూటికి మరాఠ నేతలు

ముంబై, జూలై 31:ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని విస్తరించేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన నాయకులను కలుపుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల మహారాష్ట్రకు ఆయన ఎక్కువగా వెళ్తూ అక్కడి నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీలోని నాయకులు చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, చక్కెర కర్మాగారాల యజమాని.. మరాఠా థన్‌కర్ సామజిక వర్గంలో పట్టున్న బాలాసాహెబ్ కన్నవార్ బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన రైతు ఉద్యమ నాయకుడు కిషన్ హరిశ్చంద్ర కశీద్, పలువురు శివనేతలు చేరారు.

మరోవైపు ఉస్మానాబాద్ జిల్లా ఆర్‌ఎస్‌పీ ప్రెసిడెంట్ ఓంకార్ నికమ్, కాంగ్రెస్ నాయకుడు విశ్వజిత్ షిండే బీర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. అలాదే ఆర్‌ఎస్‌పీ మహారాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మాణిక్ పోలా, ఛత్రపతి సేన రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్ బాహూ మాల్మే తదితరులు పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన ఈ పార్టీ చేరికలో సమావేశంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంఛార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు శంకరన్న డోందే తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తమ పార్టీని రంగలోకి దింపనున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎన్నికలు దగ్గిరికొస్తున్నందున ఇంకా ఏ రాష్ట్రాల్లోని నాయకులు బీర్‌ఎస్‌లో చేరుతారని ఆసక్తి నెలకొంది.

 ఆగస్ట్ 1 మహారాష్ట్రకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఆగస్ట్ 1న మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం కొల్లాపూర్ లోని మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వత సాహు మహారాజ్ మనవడిని కేసీఆర్ కలవనున్నారు. అనంతరం హైదరాబాద్ నగరానికి తిరుగు పయనం అవుతారు. మహారాష్ట్రలో కేసీఆర్ ఒక్కరోజు పర్యటన చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.