A place where you need to follow for what happening in world cup

నంద్యాలలో ఆర్భాటంగా” జన సేన” పార్టీ కార్యాలయం ప్రారంభం.

  • ప్రజల సమస్యలపై పోరాడే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్.
  • రక్తదానం అన్ని దానల్లో విశిష్టమైంది.
  • పట్టణంలో యువత బైక్ ర్యాలీ….యువత రక్తదానం.
  • 600 జన సేన యువతకు కిట్లు పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభంజనం నంద్యాలలో మొదలైంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జన సేన పార్టీ కార్యాలయాలు ఒక్కొక్కటి ప్రారంభం అవుతున్నాయి.నంద్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో కొణిదెల నాగ బాబు ఆదేశాల మేరకు కవల సోదరులు చందు,సుందర్ లు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా జన సేన పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కవల సోదరుల తల్లి రాచమడుగు లక్షిదేవి చేతుల మీదుగా ప్రారంభించారు.అంతకు ముందు భారీగా యువత పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.జన సేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న యువత కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కేకు కట్ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కు ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది వెదుర్ల రామచంద్రా రావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అన్ని ధానల్లో కంటే విశిష్టమైంది అన్నారు.రోడ్డు ప్రమాదాలు,ప్రసవ సమయంలో రక్తం దొరకక ఎందరో చనిపోతున్నారని అన్నారు.రక్తదానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మ ఇచ్చిన వారమైతామని పేర్కొన్నారు.యువత ప్రతి ఏడాది మూడు సార్లు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.దేశంలో గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా యువత 100 యూనిట్ల రక్తదానం చేయడం గొప్ప విషయం అన్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందారు అన్నారు.సామాన్య కుటుంబంలో పుట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టి కిడ్నీ రాకెట్ బయట పెట్టడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ను బంద్ చేస్తే వాటి పై ఆధార పడ్డ కుటుంభాలకోసం పోరాటం చేయడం వల్ల ప్రభుత్వం దిగి వచ్చి ఇసుకను విడుదల చేసిందని పేర్కొన్నారు. మైన్స్ అక్రమ రవాణా బయటికి తీసుకొచ్చారని అన్నారు.

కర్నూల్ లో సుగాలి ప్రీతి సంఘటన వెలుగులోకి తీసుకొని రావడంతో చర్చనీయాంశంగా మారిందని అన్నారు.ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు.అనంతరం నంద్యాల జన సేన పార్టీ ఇంచార్జీ లు కవల సోదరులు చందు,సుందర్ లు స్వస్థలం నంద్యాల దేవనగర్ ప్రాంతం.ఇద్దరు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.చిన్నతనం నుంచి కొణిదెల కుటుంభానికి వీరాభిమానులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే మాకు మంచి అవకాశం లభించడంతో జన సేన పార్టీలో చేరామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజలు,యువత ఆదరిస్తున్నారని అన్నారు.పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు ,ఎన్నో విషయాలు వెలుగుచూస్తున్నాయి అన్నారు.

వైసిపి పార్టీ చేస్తున్న అరాచకాలను దైర్యం ఎదురుకుంటు వారాహి యాత్ర విజయవంతం అయిందని అన్నారు.నంద్యాలలో అంచలంచెలుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం,బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశామని పేర్కొన్నారు.రక్తదానం 100 యూనిట్ల రక్తదానం యువత చేసిందని అన్నారు.పార్టీ ఆదేశాల మేరకు యువతకు జన,సేన కిట్లు 600 పంచామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోయ రామకృష్ణ,జన సేన నాయకులు సాయి ప్రదీప్ రెడ్డి,బాబా ఫకృద్దిన్,ఫరూక్,సుంకన్నా,సర్దార్,రవి,చిన్న,సంజివరాయుడు,అభి,మల్లికార్జున,మదు,మద్దిలేటి,లోకేష్,ఈశ్వర్,జీవన్,లోహిత్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.