A place where you need to follow for what happening in world cup

స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం

0 5,663

భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తజనం
నేడు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ సిఎస్‌ శాంతి కుమారి

ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు బుధవారం భక్త జన సందోహం మధ్య కన్నుల పండుగగా జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం సాయంత్రం నుండే భదాద్రికి భక్తులు చేరుకుంటున్నారు. ఇందుకోసం మార్చి 9 నుండి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి మహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఏప్రిల్‌ 23 వరకు నిర్వహించనున్నారు. మంగళవారం నాటికే భక్తులు భారీగా చేరుకున్నారు. భద్రాచలంలో పండగ వాతావరణం నెలకొంది. స్వామివారి కల్యాణం ఎప్పుడప్పుడా అని భక్తులు ఎదురు చూస్తున్నారు. స్వస్ధిశ్రీ చాంద్రమాన క్రోధనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ లగ్నమందు  కల్యాణం జరుగుతుంది. శివధనస్సును విరిచిన శ్రీ రామచంద్రమూర్తికి మిధిలానగరంలో జనకుని పుత్రిక అయిన సీతామహాలక్ష్మీకి ఆనాడు పెండ్లి జరిగితే భద్రాచలంలో ఉన్న చతుర్భుజాలు, శంఖుచక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశం గల వైకుంఠ రాముడు వరుడుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ స్వరూపురాలు అయిన సీతమ్మ వధువుగా కల్యాణం జరగడం విశేషం. భార్యాభర్తల అనుబంధానికి, అనురాగానికి నిర్వచనం ఇచ్చిన ప్రేమమూర్తులు శ్రీ సీతారాములు తెలుగువారి ఇలవేల్పు భదాద్రి రాముడు. అందుకే తెలుగు వాగ్గేయకారుడైన భక్తరామదాసు, త్యాగరాజులకు ఆయన ఆరాధ్యదైవం అయ్యాడు. ఆరాధనకు అనుగుణంగా కీర్తనలు గానం చేయడం, కీర్తనలకు అనుగుణంగా ఆరాధన చేయడం భద్రాచలం క్షేత్రంలోని ప్రత్యేకత. భదాద్రిలో శ్రీ సీతారా మనవమి నాడు జరిగే కల్యాణాన్ని అనుసరించి తమ తమ గ్రామాలు, పట్టణాల్లో, ఇండ్లల్లో కల్యాణాలు జరుపుకోవడం ఆంధ్రుల ఆనవాయితీ. తొలుత భదాద్రి రామునికి దేవాలయంలో ఉత్సవమూర్తులకు కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత మంగళ వాయిథ్యాలు మారుమోగుతుం డగా భక్తుల జై జై ధ్వానాల మధ్య పల్లకిలో శిల్పకళా శోభితమై అలరారే కల్యాణ మండపానికి పుణ్యాహవచనం, సంకల్పం చేసి, శాంతికోసం విష్వక్సేన పూజ నిర్వహిస్తారు.

తర్వాత కల్యాణానికి వినియోగించే అన్ని వస్తువుల ను, సామాగ్రిని ప్రక్షాళన చేస్తారు. ఆ తర్వాత రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహిస్తారు. 24 అంగులాల పొడవుగల 12 దర్భలతో అల్లిన ఒక దర్బతాడును సీతమ్మవారి నడుంకు బిగిస్తారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ ఎడమచేతికి రక్షా సూత్రాలు కడతారు. స్వామి గృహసామాగ్రి శుద్ధికోసం సువర్ణయజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తారు. 8 మంది శ్రీ వైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యావరణం జరిపిస్తారు. అంటే జగన్నాథుడు, దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి సీతమ్మే తగిన వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వధూవరుల వంశాలకు చెందిన పెద్దల గోత్రాలను మూడుసార్లు పఠిస్తారు. స్వామి పాదప్రక్షాళన అనంతరం పరిమళ భరిత తీర్థంతో మంత్రయుక్తంతో పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు. ఉత్సవం లోకోత్సవం అయినప్పుడు మహా సంకల్పాన్ని చెప్పాలని శాస్త్రం. జగత్‌ కల్యాణం రూపమైన ఈ  కల్యాణం పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దంపడుతూ జాతీయ భావాలను మేల్కొలుపుతుంది. సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీమహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్‌ కల్యాణార్థం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం జరుగుతుంది. కన్యాదాన సద్గుణ్యం కోసం గో, భూ, హిరణ్య మొదలైన షోడశమహాదానాల కూడా సమర్పిస్తారు. తర్వాత మంగళం చేకూర్చాలనే భావంతో చదివే ఆశీస్సులు ఒక్క సీతారాములకే కాక, వారి కల్యాణాన్ని తిలకించేందుకు భద్రాచలం వొచ్చిన భక్తులు అందరికి వర్తించే విధంగా ఉంటాయి. మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా వేదమంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లంను శిరస్సుపై ఉంచితే మనలో సత్యం, సద్భావన పెరుగుతుందని శాస్త్రం.

ఆ తర్వాత జరిగే ఈ మాంగల్యం పూజలో మంగళసూత్రంలో ముగ్గురు అమ్మవార్లను ఆవాహన చేస్తారు. 9 పోగులతో మూడు సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది. 9 పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు, మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు సాంకేతకాలు. సూత్రమూలంలో గౌరీదేవిని, సూత్రమద్యంలో సరస్వతి దేవిని, సూత్రాంగంలో మహాలక్ష్మీని ఆవాహన చేస్తారు. ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహంతోనే లోకంలో సౌశీల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు ప్రవర్తిల్లుతున్నాయి. ఈ ముగ్గురమ్మలను ఆవాహన చేసి మంగళసూత్రాలలో భక్త రామదాసు చేయించిన మంగళపతాకాన్ని ధరింపచేయడం ఈ క్షేత్రం యొక్క విశేషం. ఆ తర్వాత మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా భక్తుల జై జై ధ్వానాల మధ్య పల్లకిలో శిల్పకళా శోభితమై అలరారే కల్యాణ మండపానికి పుణ్యాహవచనం, సంకల్పం చేసి, శాంతికోసం విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. తర్వాత కల్యాణానికి వినియోగించే అన్ని వస్తువులను, సామాగ్రిని సంప్రోక్షణ చేస్తారు. ఆ తర్వాత రక్షా బంధనం, మోక్ష బంధనం నిర్వహిస్తారు. 24 అంగులాల పొడవుగల 12 దర్భలతో అల్లిన ఒక దర్బతాడును సీతమ్మవారి నడుంకు బిగిస్తారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ ఎడమచేతికి రక్షా సూత్రాలు కడతారు. స్వామి గృహసామాగ్రి శుద్ధికోసం సువర్ణయజ్ఞపవీతాన్ని ధరింపచేస్తారు. 8 మంది శ్రీ వైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యావరణం జరిపిస్తారు. అంటే జగన్నాధుడు, దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి సీతమ్మే తగిన వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు.

ఆ తర్వాత వధూవరుల వంశాలకు చెందిన పెద్దల గోత్రాలను మూడుసార్లు పఠిస్తారు. స్వామి పాదప్రక్షాళన అనంతరం పరిళభరిత తీర్థంతో మంత్రయుక్తంతో పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు. ఉత్సవం లోకోత్సవం అయినప్పుడు మహా సంకల్పాన్ని చెప్పాలని శాస్త్రం. జగత్‌ కల్యాణం రూపమైన ఈ కల్యాణం పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దంపడుతూ జాతీయ భావాలను మేల్కొలుపుతుంది. సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీమహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్‌ కల్యాణార్థం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం జరుగుతుంది. కన్యాదాన సద్గుణ్యం కోసం గో, భూ, హిరణ్య మొదలైన షోడశమహాదానాల కూడా సమర్పిస్తారు. తర్వాత మంగళం చేకూర్చాలనే భావంతో చదివే ఆశీస్సులు ఒక్క సీతారాములకే కాక, వారి కల్యాణాన్ని తిలకించేందుకు భద్రాచలం వొచ్చిన భక్తులు అందరికి వర్తించే విధంగా ఉంటాయి. మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా వేదమంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లంను శిరస్సుపై ఉంచితే మనలో సత్యం, సద్భావన పెరుగుతుందని శాస్త్రం. ఆ తర్వాత జరిగే ఈ మాంగల్యం పూజలో మంగళసూత్రంలో ముగ్గురు అమ్మవార్లను ఆవాహన చేస్తారు. 9 పోగులతో మూడు సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది. 9 పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు, మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు సాంకేతకాలు.

సూత్రమూలంలో గౌరీదేవిని, సూత్రమద్యంలో సరస్వతి దేవిని, సూత్రాంగంలో మహాలక్ష్మీని ఆవాహన చేస్తారు. ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహంతోనే లోకంలో సౌశీల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు ప్రవర్తిల్లుతున్నాయి. ఈ ముగ్గురమ్మలను ఆవాహన చేసి మంగళసూత్రాలలో భక్తరామదాసు చేయించిన మంగళపతాకాన్ని ధరింపచేయడం ఈ క్షేత్రం యొక్క విశేషం. భద్రాచలంలో బుధవారం జరిగే స్వామివారి కల్యాణంకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేసారు.కల్యాణ మండపంఅంతా సుందరంగా తీర్చిదిద్దారు.ఆలయంకు ,అనుబంధ ఆలయాలకు రంగరంగు విధ్యుత్‌ దీపాలు అలంకరించారు.వివిధ రాస్ట్రాలనుండి ,జిల్లాలనుండి వచ్చే భక్తులకు ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రధాన రహదారులు వద్ద స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసారు.కల్యాణ మండపంఅంతా చలువపందిళ్ళతో పాటు రంగురంగుల చాంధినీ వస్త్రాలు అలంకరించారు.స్వామివారి కల్యాణం ప్రశాంత వాతావరణంలో భక్తులు చూసేందుకు ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేసారు.భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎఇర్‌కూలర్‌లను,ఫ్యాన్లను ఏర్పాటు చేసారు.వివిధ స్వచ్చంద సంస్థలద్వారా కల్యాణ మండపంలోని భక్తులకు ,బయటనుండి  కల్యాణం వీక్షించే భక్తులకు మంచినీరు,మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు.భద్రాచలం ప్రాంతం అంతా పండగ వాతావరణం సంతరించుకుంది.పగటిని మైమరిపించేవిధంగా ప్రధాన రహదారులన్నీ భద్రాచలం గ్రామపంచాయితీ విద్యుత్‌ దీపాలు అలంకరించారు.

ఆ పెళ్ళి కళ చూడాల్సిందే…!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగులు అనే విధంగా పట్టణంలోని కల్యాణమండపం ఆవరణలో ఏర్పాటు చేసి వెదురుపందిర్లు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది. కల్యాణ మండపంతో పాటు పట్టణంలోని చప్టా దిగువ, గోదావరి నది ఒడ్డు తదితర ప్రాంతాల్లో చలువపందిర్లు కల్యాణ శోభను తెలియజేస్తున్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది మండపంతో పాటుగా బ్రిడ్జీ సెంటర్‌ వరకు చాందినీ వస్త్రాలతో ప్రధాన రహదారులు అలంకరింప చేసారు.పెళ్ళి కళ ఉట్టిపడేలా పట్టణంలో ఎక్కడ చూసినా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మండపం ఆవరణలో వెదురు చలువ పందిర్ల క్రింద అందంగా అమర్చిన రంగుల చాంధినీ వస్త్రాలు మరింత అందం తెచ్చాయి. ప్రఖ్యాత శిల్పకళాచార్యుడు గణపతిస్థపతి నిర్మించిన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కల్యాణ శోభతో భద్రాచలం పట్టణం నాటి మిధిలానగరంను గుర్తుకు తెస్తుంది. సీతారాముల వివాహం కోసం నాటి మిధిలానగరమే నేటి భదాద్రిలో మిధిలాస్టేడియంగా మారిందా అనే విధంగా పెళ్ళి ఏర్పాట్లును అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఆనాదిగా వస్తున్న ఆభరణాలైన రామదాసు చేయించిన మంగళసూత్రాలు, చింతాకుపతకం, పచ్చలపతకం, కళికితురాయి వంటి ఆభరణాలు ఈ కల్యాణ కార్యక్రమంలో ఉత్సవ మూర్తులకు అలంకరింపచేస్తారు. జగత్కల్యాణం కోసం పట్టణంలో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న ఈ కల్యాణ మహోత్సవాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు.

ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ సిఎస్‌ శాంతి కుమారి
శ్రీ సీతారామకల్యాణంకు ముత్యాల తలంబ్రాలు,పట్టువస్త్రాలు అందించేందుకు ప్రభుత్వం తరుపున ఛీప్‌సెక్రటరీ శాంతి కుమారి ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌, సమాచారపౌరసంబంధాలు, దేవాదాయశాఖా కమిషనర్‌ హనుమంతరావు, ఎస్పీ రోహిత్‌ రాజ్‌ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వొచ్చే అవకాశం లేనందున ప్రభుత్వం తరుపున సిఎస్‌ శాంతకుమారి స్వామివారి కల్యాణంకు విచ్చేశారు. అమే ఈ రాత్రి ఐటిసి అతిథిగృహంలో బసచేస్తారు. ఉదయం కల్యాణం ప్రారంభ సమయంలో ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు స్వామివారికి అందించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.