A place where you need to follow for what happening in world cup

ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ అమలులోకి

  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వచ్చే రెండు రోజులలో పూర్తి చెయ్యాలి
  • వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉన్నదని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వచ్చే రెండు రోజులలో పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఈనెల 5 తర్వాత శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున, ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి సంక్షేమ పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలను స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో వెంటనే చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ పాటిస్తూ అన్ని కార్యక్రమాలను వచ్చే రెండు రోజులలో పూర్తి చేసుకోవాలని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టుటకు వీలుపడదని అధికారులకు తెలియజేశారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.