A place where you need to follow for what happening in world cup

రుణమాఫీ వాపస్‌ ‌పేరుతో కొత్త డ్రామా

కేసీఆర్‌ ‌రైతును రాజును చేస్తే.. రు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌ ‌దృష్టి సారించారని విమర్శించారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెడుతున్నారన్నారు.  సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. సెల్ఫీ దిగి నేను రైతునని రైతు నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు.

ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు రుణమాఫీ చెయ్యలేక రేవంత్‌ ‌సర్కార్‌ ‌నయా డ్రామా షురూ చేసిందన్నారు. మొన్న ఖమ్మంలో పింఛన్‌ ‌వాపస్‌.. ఇప్పు‌డు రైతు రుణమాఫీలో వాపస్‌ ఆప్షన్‌ అం‌టూ ఎక్స్ ‌వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.’మాఫీకానీ రుణమాఫీ.. రైతులను అనుమానిస్తున్న రేవంత్‌ ‌సర్కార్‌. ‌సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతొ కొత్త డ్రామా.. ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌పై దృష్టి. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్‌ ‌వాపస్‌.. ఇప్పు‌డు రైతు రుణమాఫీలో వాపస్‌ ఆప్షన్‌. ‌కేసీఆర్‌ ‌రైతు రాజును రాజు చేస్తే.. రు అనుమానిస్తూ వేధిస్తున్నారు.

ఇప్పటికే మాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి జూటా మాటలు అసత్య ప్రచారాలు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు.. సెల్ఫీ దిగి నేను రైతును అని రైతు నిరూపించుకోవాలా?. ఆడలేక మ్దదెలు అడ్డు అన్నట్టు రుణమాఫీ చెయ్యలేక రేవంత్‌ ‌సర్కార్‌ ‌నయా డ్రామా షురూ. వద్దురా నాయన కాంగ్రెస్‌ ‌పాలన’ అంటూ ట్వీట్‌ ‌చేశారు.

Leave A Reply

Your email address will not be published.