A place where you need to follow for what happening in world cup

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం

కలెక్టర్లతో తెలంగాణ కమిషనర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్
‌తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి  గురువారం అన్ని  జిల్లాల కలెక్టర్లతో  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. వోటర్‌ ‌జాబితా, పోలింగ్‌ ‌బూత్‌ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రానున్న నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు అందరూ సమాయత్తం కావాలని ఈ సందర్భంగా కలెక్టర్లను కమిషనర్‌ ఆదేశించారు. కాగా, మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

మొదట సర్పంచ్‌, ‌తర్వాత జెడ్పీ, ఎంపీటీసీ ఆ తర్వాత మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు.సెప్టెంబర్‌ 6‌వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ ‌డ్రాఫ్ట్ ‌నోటిఫికేషన్‌, 21‌వ తేదీన ఫైనల్‌ ‌వోటర్‌ ‌లిస్ట్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఒక్కో పోలింగ్‌ ‌కేంద్రం పరిధిలో 600 వోటర్లు.. 650 వోట్లు దాటితే అదనపు పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈసీ డిసైడ్‌ అయ్యింది. లోకల్‌ ‌బాడీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని వ్యూహాలు మొదలుపెట్టగా.. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ లోకల్‌ ‌బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>