A place where you need to follow for what happening in world cup

ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టండి

పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి
ఎన్‌ఎటిని ఆదేశించిన సుప్రీమ్‌కోర్టు

నీట్‌-‌యూజీ పేపర్‌ ‌లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు..పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ’నీట్‌- ‌యూజీ’ సంబంధిత పిటిషన్‌లను జులై 22న తిరిగి విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలని సూచించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-‌యూజీ పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశి ంచగ లమని సం దర్భ ంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తీవ్ర వాదనలు కొనసాగాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ప్రశ్నపత్రం లీకేజీ కేవల పట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.
అయితే, గుజరాత్‌లో అలాం టిదే జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పేపర్‌ ‌లీక్‌ ‌కొన్ని కేంద్రాలకే పరిమి తమైందా? లేదా ఇతర కేంద్రాలు, దేశవ్యాప్తంగా వ్యాపించిందా? అనే విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందు బాటులో ఉంచడం కీలకమని వ్యాఖ్యా నించింది. అయితే, విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి వివరాలు కనిపించడకుండా ఉంచాలని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.