స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి
అప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు
అఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
అకార్మికుల గురించి మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్ నేతలకు లేదు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలకు అనుమ తులు ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశా లలకు సుమారు 24 వేల బస్సులు ఉన్నాయని, ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారం భానికి నెల ముందు మే 15 నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకొని ఆన్ లైన్‌లో బస్సులతో పాటు డ్రైవర్లు, అదనపు డ్రైవర్లు, అటెండర్లు అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి వారు అన్ని విధాలా పర్ఫెక్ట్ అని నిర్ధారిం చుకున్న తర్వాతే ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నామని తెలిపారు.
స్కూల్, కాలేజీ బస్సులు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానమిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు అనుగు ణంగా 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ కింద తీసుకొని బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి బస్సుల్లో ఫైర్ ఫోన్ నంబర్, మెడికల్ కిట్ తప్పనిసరి చేశాం.. పాఠశాల విద్యార్థుల సమయానికి బస్సులు నడపాలని సభ్యులు సూచించారు.. పాఠశాల ఏరియాల వారీగా బస్సులు నడిపేలా చూస్తాం. బస్సుల్లో సేఫ్టీ మెజర్‌మెంట్స్ పై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ సమీక్షలో ఆదేశించాను. రవాణా శాఖకు సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. వెంటనే స్పందిస్తాం. అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
కార్మిక సంస్థలను రద్దు చేసిన గత ప్రభుత్వానికి యూనియన్ల గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి పొన్నం అన్నారు. కార్మికులకు ముందు క్షమాపణ చెప్పి అడగాలని అన్నారు. 50 రోజులు సమ్మె చేస్తూ కార్మికులు చనిపోయినా పట్టించుకోని నాయకులు ఇప్పుడు మాట్లాడు తున్నారని ఎద్దేవా చేశారు.10 సంవత్సరాల్లో ఒక్క బస్సు అయినా కొన్నారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొత్త బస్సులు కొన్నామని తెలిపారు. 2013 నుంచి పెండింగ్ లో ఉన్న 280 కోట్ల బాండ్ల బకాయిలు 80 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కు చెందిన 4 వేల కోట్ల పీఎఫ్, సీసీఎస్ నిధులు వాడుకుందని విమర్శించారు. ఆర్టీసిని 7 వేల కోట్లతో తమకు అప్పగించారు. తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.300 కోట్లు కేటాయిస్తోందన్నారు.
ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేశారని తెలిపారు. రూ.2400 కోట్ల మేర ప్రయాణం చేస్తే 2000 కోట్లు ప్రభుత్వం మహాలక్ష్మి ద్వారా ఆర్టీసి చెల్లించిందన్నారు. చనిపోయిన ఆర్టీసి కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఆర్టీసి తార్నాక హాస్పిటల్‌లో ఎంఆర్ ఐ సీటీ స్కాన్ తీసుకొచ్చా మని తెలిపారు. 3035 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.బస్సుల్లో 95 శాతం అక్యుపెన్సి పెరిగిందని, నష్టాల ఉన్న ఆర్టీసి ఈ 3 నెలల్లో ఆపరేషనల్ లాస్ లేకుండా ఓవర్ కం ద్వారా బయట పడుతున్నామన్నారు. రూ.35 కోట్ల అదనపు భారం పడినా కూడా ఆర్టీసి ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇచ్చామని మంత్రి పొన్నం వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసి ఆస్తులను వారి పార్టీ నాయకులకు అప్పనంగా తక్కువ ధరలకు అప్పగించారని ఆరోపిం చారు.. తమ ప్రభుత్వానికి ఆర్టీసి కార్మికుల సంక్షేమం, ప్రజా రవాణా సౌకర్యానికి అధికా ప్రాధాన్య మిస్తున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు.