A place where you need to follow for what happening in world cup

గొడిసిర్యాల శివాలయంలో అద్భుతం.. ప్రతి ఏటా గుడిలోకి నాగుపాము

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసిర్యాల శివాలయంలో శుక్రవారం శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో నాగుపాము వచ్చింది.ప్రతి ఏటా ఈ అద్భుతం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో భక్తుల మధ్యనుంచి నాగుపాము గుడిలోకి వస్తోంది.

దేవాలయంలో శివలింగం చుట్టూ తిరిగి గుడంతా కలియదిరిగాక వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే ఈ పామును భక్తులు కూడా ఏమీ అనరు. అలాగే పాము కూడా ఈ ఎవరికి ఎలాంటి హానీ చేయకుండా వెళుతుంది. ప్రతి ఏడాది ఈ అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు భక్తులు ఈ దేవాలయాన్ని ప్రత్యేకంగా సందర్శిస్తారు.

Leave A Reply

Your email address will not be published.