A place where you need to follow for what happening in world cup

హైదరాబాద్ లో రేవ్ పార్టీ భగ్నం

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపుతున్నాయి. మాధపూర్‌ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ ఓ నిర్మాతతోపాటు ఐదుగురు ప్రముఖులను అరెస్టు చేశారు. మాధాపూర్‌ పరిధిలోని విఠల్‌రావ్‌ నగర్‌లో వైష్ణవి అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో సిబ్బంది విషయాన్ని తెలుసుకొని దాడి చేసింది. ఈ దాడిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. భారీగా కొకైన్, ఎల్‌ఎస్‌డీని స్వాధీనం చేసుకున్నారు. సినీ ప్రముఖులను కూడా పట్టుకున్నారు. నిర్మాత వెంకట్‌తోపాటు పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల రైడ్‌లో సినీ నిర్మాత వెంకట్‌తోపాటు బాలాజీ, కె. వెంకటేష్‌రెడ్డి, డి. మురళి, మధుబాల,మేహక్‌ను ్రెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన కొకైన్, ఎల్‌ఎస్‌డీని స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో కొందరు టాలీవుడ్‌కు సంబంధించిన యువతులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

పోలీసులు మాత్రం దీనిపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కొన్ని రోజుల నుంచి డ్రగ్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసలు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎవరెవరికి సప్లై అవుతుందో తెలుసుకునే పనిలో ఉంది నార్కోటిక్ బ్యూరో. ఈ క్రమంలోనే రేవ్‌ పార్టీ సంగతి బయటకు వచ్చింది. గతంలో కూడా వెంకట్‌పై ఆరోపణలు వచ్చాయి. అందుకే అప్పటి నుంచి ఆయనపై కన్నేసి ఉంచారు పోలీసులు. ఈ నిఘాకు ఇప్పుడు చిక్కుకున్నాడు వెంకట్‌. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అసలు వీళ్లకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు. నెట్‌వర్క్‌ను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం చిక్కిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో కొందరికి డ్రగ్స్ కేసుల్లో మూలాలు ఉన్నట్టు తెలుస్తోంది. వారి ఫోన్లను స్వాధీనం చేసుకొని అందులో ఉండే నెంబర్లు, తరచూ ఫోన్లో మాట్లాడే వారి వివరాలు తెలుసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.