A place where you need to follow for what happening in world cup

స్కీములంటే బీ.ఆర్.ఎస్… స్కాములంటే కాంగ్రెస్ …

0 359
  • ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి
  • దొంగకు మరొ దొంగ మద్దతు పలకడానికి వచ్చినట్లు ఉంది కాంగ్రెస్ సభ
  • రామగుండం ఎమ్మెల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్

స్కీములంటే బీ.ఆర్.ఎస్ పార్టీ అని, స్కాములంటే కాంగ్రెస్ పార్టీ అని ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని గోదావరిఖనిలో జరిగిన కాంగ్రెస్ సభ, ఒక దొంగకు మరో దొంగ మద్దతు పలకడానికి వచ్చినట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి సభలో ప్రజల స్పందన చూస్తేనే బీఆర్ఎస్ పార్టీ రామగుండంలో అఖండ మెజారిటీతో గెలువబోతోందని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని అర్థమైందన్నారు. ఫెన్షన్ పొందుతున్నవారు చెయ్యెత్తమంటే..ఒక్క చెయ్యి పైకి లేవలేదని, అంటే కేసిఆర్ పాలనలో పెన్షన్ పొందుతున్నవారు కృతజ్ఞతగా సభలో పాల్గొనక బహిష్కరించారన్నారు. ఆఖరికి కాంగ్రెస్ కు ఓటేసే వాళ్ళు చెయ్యెత్తమని కోరినా, స్పందన కరువవడంతోనే బీఆర్ఎస్ విజయం ఖాయమైందన్నారు. బోపోర్స్ నుండి బొగ్గు బ్లాకులదాకా కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయమేనన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. కాంగ్రెస్ హయాంలో బొగ్గు బ్లాకులను తమ అనుయాయులకు కట్టబెట్టినందుకే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెండర్ ద్వారానే బొగ్గు బ్లాకులను కేటాయించాలని ఎంఎండిఆర్-2014 యాక్ట్ పార్లమెంట్ లో బిల్లు తెచ్చిందన్నారు.

బొగ్గు కుంభకోణంలో నాటి మంత్రి దాసరి నారాయణరావు జైలుకెళ్లిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. 1975లో ఓసీపీలను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయని, ఈప్రాంత కార్మికులు మరో ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకే జిడికే 5వ గనిని ఓసిపిగా మార్చాల్సి వచ్చిందని, ఓ సిపి-5 నూతన గని కాదన్నారు. ఆ మాత్రం అవగాహనలేని నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాడు సోనియా గాంధీ బలి దేవత అన్న రేవంత్ రెడ్డి, నేడు సోనియాను తెలంగాణ దేవత అంటున్నాడని, అది నాలుకా తాటిమట్టా అన్నారు. కారు గుర్తు కు ఓటు వేసి, పూటకో మాట మాట్లాడే స్కాంల పార్టీ కాంగ్రెస్ పార్టీ కి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేశం రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ బీ.ఆర్.ఎస్ ఎన్నికల ఇంచార్జ్ నారదాసు లక్ష్మన్ రావు, బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి, నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, తోడేటి శంకర్ గౌడ్, మాదాసు రామమూర్తి, జే.వి.రాజు, చిప్ప రాజేష్, జిమ్మి బాబు, అనుముల కళావతి, పిల్లి రమేష్, ముల్కల్ల గోవర్దన శాస్రి శాంత లక్ష్మి స్వాతి తదితరులు పాల్గొన్నారు.

అకాశం నుండి పాతళం వరకు కాంగ్రెస్ అవినీతి
అకాశం నుండి పాతళం వరకు 2 జీ స్పెక్ట్రం నుండి బొగ్గు బావుల దాకా
కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడిందని కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలని టి.బి.జి.కె.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య అన్నారు. శనివారం గోదావరిఖని బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం రామగుండం శాసనసభ్యులు బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ గారు గారితో పాటు మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెవంత్ రెడ్డి సభ ను ఈ ప్రాంత ప్రజలంతా తిరస్కరించారని ఇక్కడ బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ గారు విజయం ఖాయమని స్పష్టమైయుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎర్ర జెండా యూనియన్లు సింగరేణి లో వారసత్వం ఉద్యోగాలు పోగోట్టి కార్మికుల వారసుల జీవితాలు నాశనం చేశారన్నారు. సిఎం కేసీఆర్‌ గారు వచ్చాకే వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారని కారుణ్య నియమాకాల ద్వారా సింగరేణి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది సిఎం కేసీఆర్‌దన్నారు. రాష్ట్రం లో దేశంలో 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓసిపిలు మూసివేశారని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్‌ గారి పై తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో రాష్ట్రం లో రామగుండం లో బీ.ఆర్.ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజలు బీ.ఆర్.ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ గెలిపించబోతున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Epaper

X