A place where you need to follow for what happening in world cup

మరో 2 రోజులు వానలే..వానలు

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడు ఏపీ తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించ్చారు. దింతో పాటు తూర్పు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. వీటి ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిపీస్తున్నాయి. ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో నాలుగు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది వెదర్ డిపార్ట్‌మెంట్. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్‌, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. ఈరోజు కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం విజయనగరం అల్లూరి జిల్లా ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఈరోజు ఎల్లో అలర్ట్. రేపు కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వర్షాలు ఉంటాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.

ఏపీ తెలంగాణ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం.. కొనసాగుతోంది. సముద్రమట్టానికి 4.5 – 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఆవర్తనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కొనసాగుతాయి. అల్పపీడనం ఏర్పడిన తర్వాత మూడు రోజులపాటు కొనసాగి ఆ తర్వాత పశ్చిమ దిశగా కదులుతుందని అంటున్నారు అధికారులు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నెల రోజుల తర్వాత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఖరీఫ్ కోసం వేచి చూస్తున్నా రైతన్నలకు ఇది ఊరట నుంచి అంశం అయినప్పటికీ.. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.