A place where you need to follow for what happening in world cup

వ్యూహాలతో పార్టీలు రెడీ

ఏపీ కంటే ముందు తెలంగాణాలో రాబోతోంది ఎన్నికల సీజన్. అక్టోబర్ ముగిసేలోగా నోటిఫికేషన్ రావడం గ్యారంటీ. సో.. మరో మూడునెలలకు మించి గ్యాప్ లేదు. అందుకే యాక్షన్ ప్లాన్లు స్పీడప్ చేశారు. స్కెచ్చుల మీద స్కెచ్చులు గీస్తూ బుర్రల్ని అరగదీస్తున్నారు నేతలు. సడన్‌గా కార్యాచరణలోకి దిగేసిన మూడు ప్రధాన పార్టీలు.. ఓటర్లను కూడా ఎటెన్షన్‌లోకి తెచ్చుకున్నారు. మూడునెలలు.. మూడు పార్టీలు.. మూడో విజయం కోసం ఎదురుచూస్తున్న అధికార పార్టీ. తెలంగాణా యుద్ధరంగం సిద్ధమైనట్టే. మిగిలింది మూడే నెలలు.. పైగా ముక్కోణపు పోటీ.. ఎవరికెన్ని విన్నింగ్ ఛాన్సెస్‌ ఉన్నాయో అంతుబట్టని పరిస్థితి. ఎవరికి వాళ్లు ధీమా ప్రదర్శిస్తున్నా.. ఆదమరిస్తే అంతేసంగతులన్న అప్రమత్తాలూ ఉన్నాయి. అందుకే.. చదివిన థియరీ చాలు.. ఫైనల్‌గా ప్రాక్టికల్స్‌లోకి దిగేద్దాం రండి అంటూ మూడు పార్టీలూ ఎగ్జామ్ మూడ్‌లోకి వచ్చేశాయి.. మాంచి కిక్కిచ్చే గేమ్‌ ప్లాన్లు మొదలుపెట్టుకున్నాయి. అధికార పార్టీ ఐతే.. మాటల ఘాటు అమాంతం పెంచేసింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీదైతే ప్రత్యక్ష యుద్ధాన్నే ప్రకటించింది బీఆర్‌ఎస్. ఇందుకోసం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని డిసైడైంది. ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేదంటూ కేంద్రంలో రూలింగ్ పార్టీని కార్నర్ చేస్తోంది గులాబీ పార్టీ. ‘వంద అబద్ధాల బీజేపీ’ పేరుతో ప్రగతిభవన్‌లో సీడీని, బుక్‌లెట్‌ని రిలీజ్ చేశారు కేటీఆర్. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్ మన్నె, దినేష్, సతీష్ రెడ్డి, జగన్మోహన్ సమకూర్చిన ఈ ‘100 అబద్ధాల బీజేపీ’తో మోదీ సర్కార్‌ని టార్గెట్ చెయ్యబోంది గులాబీ పార్టీ. మోదీ, అమిత్‌షాతో పాటు మిగతా బీజేపీ మంత్రులు ఆడి తప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ తెలంగాణా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్నది బీఆర్‌ఎస్ ఎత్తుగడ. అటు.. బీఆర్ఎస్ కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతోంది.తెలంగాణాలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మూడు దశల ఉద్యమానికి నాంది పలికింది కమలదండు.

కేసీఆర్ హటావో-తెలంగాణ బచావో ఇదీ నినాదం. ఈ మేరకు పార్టీ ప్రణాళికను సైతం వెల్లడించింది. మొదటి విడతలో భాగంగా.. ఆగస్ట్ 16- పల్లె బాట, బస్తీ బాట, ఆగస్ట్ 17 బాధితులతో, దరఖాస్తు దారులతో మండల, డివిజన్ వారీగా ముట్టడి, ఆగస్ట్ 18 ప్రధాన రహదారుల్లో రాస్తారోకో, ధర్నా, ముట్టడి కార్యక్రమాలు చేపట్టనుంది. రెండో విడతలో భాగంగా.. ఆగస్ట్ 23 – అధికార ఎమ్మేల్యేల ఘెరావ్, ఆగస్ట్ 24 – మంత్రుల ఘెరావ్, ఆగస్ట్27 – కలెక్టరేట్ల ముట్టడి, జైల్ భరో నిర్వహించనుంది. మూడో విడతగా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ.ఎన్నికల ప్రణాళికలో భాగంగా టీ-పీసీసీ స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. అత్యంత క్లిష్టంగా భావిస్తున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను షురూ చేసింది. ఈనెల 18 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి.. ఆ తర్వాత వడబోత మీద ఫోకస్ పెట్టబోతోంది స్క్రీనింగ్ కమిటీ. జనరల్ స్థానాల్లో కూడా సామాజిక న్యాయం పాటించాలన్న డిమాండ్లను పరిశీలిస్తున్నారు. త్వరలో మరోసారి సమావేశమై అభ్యర్థుల ఎంపికపై ఒక అవగాహనకు వస్తుంది. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానముందని, ఎస్సీ వర్గీకరణ వ్యక్తుల కోసం చేయబోమని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చెప్పారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. దామాషా ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు.

రిజర్వేషన్లు పెంచుతాం..అందరికీ పంచుతాం.. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు అంటూ స్వీట్‌ వార్నింగులిచ్చారు రేవంత్.అటు.. చేవెళ్లలో ఈనెల 18న జరగాల్సిన కాంగ్రెస్ సభ వాయిదా 24కు వాయిదా పడింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు చేవెళ్ల నేతలతో కలిసి ఎక్సర్‌సైజ్ చేశారు పీసీసీ అధ్యక్షుడు. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా గాంధీభవన్‌లో స్పీచ్ ఇచ్చిన రేవంత్.. శ్రేణుల్ని సమాయత్తం చేశారు. ‘తిరగబడదాం-తరిమికొడతాం’ నినాదాన్ని సీరియస్‌గా తీసుకుని ముందుకెళుతోంది టీ-కాంగ్రెస్ పార్టీ.కానీ.. అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తమకు పోటీయే కాదన్న ధీమాతో ఉంది. ఒక చేత్తో బీజేపీని, మరో చేత్తో కాంగ్రెస్ పార్టీని ఆటాడిస్తూ… హ్యాట్రిక్ కొట్టేది మేమే అనే భరోసా బీఆర్‌ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. విపక్షాల తీరును నేలకేసి బాదేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ మీద వెర్బల్ ఎటాక్‌ని పీక్స్‌లో నడిపించారు.కౌంట్‌డౌన్ దగ్గర పడ్డంతో ఎవరికివాళ్లు స్పీడు పెంచి ఘాటు పెంచి కొంచెం నీటుగా మరికొంచెం నాటుగా అవతలి పార్టీల మీద దూకుడు మంత్రం ప్రయోగిస్తున్నారు. సో.. రాబోయే మూడునెలలూ.. తెలంగాణా పొలిటికల్‌గా వద్దన్నకొద్దీ మజా అన్నమాట.

Leave A Reply

Your email address will not be published.